సోమవారం 01 జూన్ 2020
Beauty-tips - Jan 08, 2020 , 16:22:05

జుట్టు పొడ‌వుగా పెర‌గాలంటే..?

జుట్టు పొడ‌వుగా పెర‌గాలంటే..?

జుట్టు పొడ‌వుగా పెర‌గాల‌ని, పెద్ద జ‌డ వేసుకోవాల‌ని దాదాపు అధిక శాతం మంది మ‌హిళ‌లు ఆశ ప‌డుతుంటారు. అందుకోసం ఏవేవో కృత్రిమంగా త‌యారు చేసిన పదార్థాల‌ను, మార్కెట్‌లో దొరికే ఆయిల్స్‌, క్రీములు, షాంపూల‌ను వాడుతుంటారు. అయితే వాటితో జుట్టుకు క‌లిగే మేలు కంటే కీడే ఎక్కువ‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలో అత్యంత స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తుల‌లో జుట్టును ఎలా పొడ‌వుగా పెంచుకోవ‌చ్చో ఇప్పుడు చూద్దాం.


1. ఒక టీస్పూన్ నిమ్మరసం, 2 టీస్పూన్ల కొబ్బరినూనెల‌ను బాగా కలపాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని కుదుళ్ల‌కు త‌గిలేలా రాసి 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత 2 నుంచి 3 గంటలు అలానే వదిలేయాలి. ఇప్పుడు దాన్ని మైల్డ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

2. కోడిగుడ్డులోని తెల్లసొన, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, అర టీస్పూన్ ఆర్గానిక్ తేనెల‌ను తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్నికుదుళ్ల‌కు, జుట్టుకి బాగా పట్టించాలి. 35 నుంచి 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించి త‌ల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేస్తే జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది.

3. హెన్నా పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, 2 టీస్పూన్ల పెరుగు, 2 టీస్పూన్ల నిమ్మరసంల‌ను తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి గంట తర్వాత మైల్డ్ షాంపూ, కండిషన్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసినా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

4. ఉసిరి రసం, నిమ్మరసం రెండింటినీ సమానంగా తీసుకుని బాగా కలపాలి. దీన్ని జుట్టుకి పట్టించాలి. ఈ మాస్క్ ని 2, 3 గంటలు అలానే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు బాగా పెరుగుతుంది.

5. అరకప్పు ఓట్స్, 2 టీస్పూన్ల బాదం నూనెల‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీని వ‌ల్ల జుట్టు బాగా పెరుగుతుంది.

6. కొబ్బరినూనె రెండు భాగాలు, తేనె ఒక భాగం తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల‌కి బాగా మసాజ్ చేయాలి. 35 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. దీని వ‌ల్ల కూడా జుట్టు పెరుగుతుంది.


logo