శనివారం 06 జూన్ 2020
Beauty-tips - Jan 08, 2020 , 16:17:57

జుట్టు రాలడం తగ్గాలంటే..?

జుట్టు రాలడం తగ్గాలంటే..?

ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి అనేక కారణాలుంటాయి. అవి ఏవైనప్పటికీ నిత్యం వెంట్రుకలు రాలిపోతుంటే.. ఎవరికైనా ఆందోళన మొదలవుతుంది. అయితే జుట్టు రాలడం అనే సమస్య నుంచి బయట పడాలంటే.. అందుకు కింద చెప్పిన పలు సూచనలు పాటించాలి. అవేమిటంటే...

1. జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఆహారంలో విటమిన్లు, మినరల్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, ఓట్స్, తృణ ధాన్యాలు తదితర ఆహారాలతోపాటు ప్రోటీన్లు, అయోడిన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండే ఆహారాలను రోజూ తినాలి. దీంతో వెంట్రుకలకు పోషణ లభిస్తుంది. జుట్టు దృఢంగా ఉంటుంది. జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.

2. కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా సరే తలస్నానం చేయాలి. తలస్నానం చేసే క్రమంలో బాగా వేడిగా ఉన్న నీరు వాడరాదు. చల్లని లేదా గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. బాగా వేడిగా ఉన్న నీటిని తలస్నానానికి ఉపయోగిస్తే జుట్టు రాలడం పెరుగుతుంది.

3. స్నానం చేసేటప్పుడు రాసుకునే షాంపూతోపాటు, జుట్టుకు ఆయిల్ వంటివి రాసేటప్పుడు కూడా కుదుళ్లకు వేళ్లను తగిలించి మర్దనా చేయాలి. కానీ గోర్లతో కుదుళ్లను తాకకూడదు. అలా చేస్తే వెంట్రుకలు రాలడం పెరుగుతుంది.

4. తలస్నానం చేశాక సహజసిద్ధమైన పద్ధతిలో జుట్టును ఆరబెట్టుకోవాలి. లేదంటే టవల్‌తో తుడుచుకోవాలి. కానీ హెయిర్ డ్రయర్‌ను వాడరాదు. వాడితే వెంట్రుకలు చిట్లి, రాలిపోతాయి.

5. ఎక్కువ దూరం, పళ్లు ఉన్న దువ్వెనలను జుట్టు దువ్వుకునేందుకు వాడాలి. కింది వైపు నుంచి జుట్టు దువ్వాలి. తడి ఉన్నప్పుడు జుట్టును దువ్వకూడదు.

6. జుట్టుకు కండిషనర్లను కూడా అప్పుడప్పుడు వాడితే వెంట్రుకలకు పోషణ లభిస్తుంది. వెంట్రుకలు రాలకుండా దృఢంగా ఉంటాయి.


logo