శనివారం 06 జూన్ 2020
Beauty-tips - Jan 08, 2020 , 16:13:16

డార్క్ స‌ర్కిల్స్ ను త‌గ్గించే ఎఫెక్టివ్ టిప్స్‌..!

డార్క్ స‌ర్కిల్స్ ను త‌గ్గించే ఎఫెక్టివ్ టిప్స్‌..!

కళ్ల కింద ఏర్ప‌డే న‌ల్ల‌ని వ‌ల‌యాలు (డార్క్ స‌ర్కిల్స్‌) అంటే ఎవ‌రికీ ఇష్టం ఉండ‌వు. ఈ క్ర‌మంలోనే డార్క్ స‌ర్కిల్స్ గ‌న‌క వ‌స్తుంటే వాటిని త‌గ్గించుకునేందుకు అంద‌రూ నానా అవ‌స్థ‌లు ప‌డతారు. కార‌ణాలేమున్నా డార్క్ స‌ర్కిల్స్ స‌హ‌జంగా అధిక శాతం మందిలో ఏర్ప‌డుతూనే ఉంటాయి. అయితే వీటిని త‌గ్గించేందుకు కింద ఇచ్చిన సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.


1. బ్లాక్, గ్రీన్ టీ బ్యాగులను అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత వాటిని ఒక్కో కంటి మీద పది నుంచి పదిహేను నిమిషాల పాటు పెట్టుకోవాలి. వెంటనే ముఖం కడిగిస్తే సరిపోతుంది. రోజూ ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తుంటే క్రమంగా న‌ల్ల‌ని వలయాలు తొలగిపోతాయి.

2. ఒక మెత్తటి బట్టని చల్లని నీళ్లు లేదా పాలల్లో కాసేపు నానబెట్టాలి. దాన్ని కళ్ల మీద కవరయ్యేలా కాసేపు అలాగే ఉంచాలి. దానిమీద నుంచి ఐస్‌క్యూబ్స్ పెట్టి కాసేపు మర్దనా చేయాలి. ఇలా తరచూ చేస్తే డార్క్ స‌ర్కిల్స్ త‌గ్గిపోతాయి.

3. కొద్దిగా పసుపులో మజ్జిగ కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని కళ్ల చుట్టూ రాసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా మంచి ఫలితం లభిస్తుంది.

4. పుదీనా ఆకులను పేస్ట్ చేసి.. అందులో నిమ్మరం కలిపి కళ్ల కింద రాయాలి. 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి.

5. కీరదోస రసం, నిమ్మరసం, టమాటా జ్యూస్ అన్నిటినీ కలిపి వలయాల చుట్టూ రాసి, 15 నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది.

6. బాదం నూనెను కొద్దిగా చేతిలోకి తీసుకొని కళ్ల చుట్టూ రాయాలి. ఉంగరం వేలుతో నెమ్మ‌దిగా ఒక నిమిషం పాటు మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత కాటన్‌తో తుడిచేయాలి. దీంతో న‌ల్ల‌ని వ‌ల‌యాలు ఇట్టే త‌గ్గిపోతాయి.


logo