బుధవారం 03 జూన్ 2020
Beauty-tips - Jan 08, 2020 , 16:05:21

అందమైన చర్మ సౌందర్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..

అందమైన చర్మ సౌందర్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..

మానవ శరీరంలో భౌతికంగా కనిపించేది చర్మం మాత్రమే. మారిన జీవనశైలితో నడి వయసు రాగానే చర్మం ముడుతలు పడుతున్నది. ముఖంపై వాపు, మొటిమలు సర్వ సాధారణమయ్యాయి. ఎందుకంటే బిజీ లైఫ్‌లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినకపోవడమే. మరి.. అందమైన చర్మ సౌందర్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసుకుందాం.


-ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు దరిచేరవు.

-వీటిల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యమైనది. ఇది మొటిమలు, సోరియాసిస్ రాకుండా కాపాడి చర్మానికి తేమను అందిస్తుంది. వాల్‌నట్, సాల్మోన్ చేపలు, మేకరెల్, సార్డినెస్, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి తినాలి.

-వీటితోపాటుగా విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఉన్న ఆహారం తీసుకుంటే ఫ్రీ రాడికల్స్ నుంచి విముక్తి కలుగుతుంది.

-చర్మం కందిపోయి నల్లగా మారడాన్ని విటమిన్ ఎ నివారిస్తుంది. ఆకుకూరలు, ఆస్పరాగస్, పీచెస్, దుంపలు, పాలకూర, గుడ్లు, స్పీడ్ పొటాటో తీసుకోవాలి.

-చర్మ సంబంధిత సమస్యలను నివారించడానికి విటమిన్ సి ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.
-ఇందుకోసం బ్రోకలీ, మొలకలు, జామ, నారింజ, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.

-చర్మ సంబంధిత క్యాన్సర్లను నివారించడానికి విటమిన్ ఇ ఉన్న ఆహారం తీసుకోవాలి. బాదం, గుడ్లు, అవకాడో, పొద్దుతిరుగుడు విత్తనాలు, పైన్ గింజలు, బొప్పాయి, ఆలీవ్ ఆయిల్ ఆహారంలో భాగం చేసుకోవాలి.

-దెబ్బతిన్న చర్మ కణజాలాన్ని పూరించడంలో, గాయాలను మాన్పించడంలో జింక్ బాగా ఉపయోగపడుతుంది. సూర్యుడి నుంచి వెలువడే హానికారక అతి నీలలోహిత కిరణాల నుంచి కూడా చర్మాన్ని కాపాడుతుంది.

-జింక్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలు దరిచేరవు. మొటిమలను త్వరగా నివారిస్తుంది. ఇందుకోసం గుమ్మడికాయ గింజలు, అల్లం, అపరాలు, సీఫుడ్, పుట్టగొడుగులు, వోట్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.

-చర్మానికి రక్షణ కల్పించడంలో సెలీనియం శక్తివంతంగా పనిచేస్తుంది. సెలీనియం అధికంగా ఉండే వాల్‌నట్స్, గోధుమ మొలకలు, చేపలు, తృణధాన్యాలను ఆహారంలో తీసుకోవాలి.


logo