బుధవారం 03 జూన్ 2020
Beauty-tips - Jan 08, 2020 , 15:55:32

బ్లాక్‌హెడ్స్ పోయేందుకు ఇంటి చిట్కాలు..!

బ్లాక్‌హెడ్స్ పోయేందుకు ఇంటి చిట్కాలు..!

ముఖంపై బ్లాక్‌హెడ్స్ వచ్చాయంటే చాలు.. ఎవరైనా చాలా అంద విహీనంగా కనిపిస్తారు. సెబాసియస్ అనే గ్రంథి సెబమ్ (ఒక రకమైన నూనె పదార్థం) అనే ఒక రకమైన తైలాన్ని ఎక్కువగా స్రవిస్తుంది. అందువల్లే ముఖంపై బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. అలాగే చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్ ఎక్కువైనా కూడా బ్లాక్ హెడ్స్ సమస్య వస్తుంటుంది. దీంతోపాటు వాతావరణంలో ఉండే కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి అంశాలు కూడా బ్లాక్ హెడ్స్ వచ్చేందుకు కారణం అవుతాయి. అయితే బ్లాక్‌హెడ్స్‌ను తొలగించేందుకు పలు సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే...

1. ముల్లంగి విత్తనాలను నూరి పేస్ట్‌లా చేయాలి. దానికి నీటిని కలిపి ముఖానికి రాసుకోవాలి. అనంతరం 15 నిమిషాలు అలాగే ఉన్నాక.. గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేస్తే బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.

2. ఒక టేబుల్ స్పూన్ పెరుగులో ఒక టీస్పూన్ బియ్యం పిండిని కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆరిపోయిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే సమస్య నుంచి బయట పడవచ్చు.

3. గంధపు చెక్క పొడికి రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. కొంత సేపు అయ్యాక మిశ్రమం ఆరిపోతుంది. అనంతరం చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య పోవడం మాత్రమే కాదు, చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.


logo