శనివారం 30 మే 2020
Beauty-tips - Jan 08, 2020 , 15:54:45

ముఖంపై మ‌చ్చ‌లు తొల‌గిపోవాలంటే..?

ముఖంపై మ‌చ్చ‌లు తొల‌గిపోవాలంటే..?

ముఖంపై మచ్చలు తొలగించుకోవడానికి చాలా మంది అనేక ర‌కాల క్రీమ్స్ వాడుతుంటారు. అయితే చాలా మందికి ఆ క్రీమ్స్ ప‌నిచేయ‌వు. దీంతో మ‌చ్చ‌ల‌ను తొల‌గించుకోవ‌డం కోసం వారు నానా తంటాలు ప‌డుతుంటారు. అలాంటి వారు కింది చిట్కాలు పాటిస్తే ముఖంపై ఉన్న మ‌చ్చ‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. అరకప్పు పాలు తీసుకుని అందులో రెండు చెంచాల ఓట్స్ వేసి బాగా మరిగించాలి, చల్లారాక మెత్తని ముద్దగా చేసి, కొంచెం పెరుగు కలిపి ఒక అరగంట ఫ్రిజ్ లో పెట్టాలి. అనంతరం ఏర్ప‌డే మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని, కొంచెం సేపయ్యాక చన్నీళ్ళ తో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం పై మచ్చల సమస్య తగ్గుతుంది.

2. పుదీనా ఆకుల్ని మెత్తగా చేసి అందులో అర టీ స్పూను నిమ్మరసం, టీ స్పూను ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించి మర్దనా చేసుకుని, తరువాత నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే నల్ల మచ్చలు దూరమవుతాయి.

3. దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం పై మొటిమలు, మచ్చలూ ఉన్న చోట రాసి, మర్నాడు ఉదయం గోరు వెచ్చటి నీటితో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

4. పచ్చి పాలలో కాస్త నిమ్మరసం కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం తుడుచుకోవాలి. తరువాత ఐదు నిమిషాలు ఆగి, ఎర్ర చందనం పొడిలో నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి పూతలా వేసుకుని ఉదయాన్నే చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మ సమస్యలు తగ్గుతాయి. మ‌చ్చ‌లు పోతాయి.


logo