గురువారం 04 జూన్ 2020
Beauty-tips - Jan 08, 2020 , 15:51:44

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచే పెరుగు..!

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచే పెరుగు..!

చాలా మంది భోజనం చివ‌ర్లో క‌చ్చితంగా పెరుగు తింటారు. పెరుగు తిన‌క‌పోతే వారికి భోజ‌నం చేసిన‌ట్లు అనిపించ‌దు. పెరుగు తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు ల‌భిస్తాయి. అంతేకాదు, పెరుగు చ‌ర్మ సౌందర్యానికి కూడా ప‌నికొస్తుంది. ఈ క్ర‌మంలోనే పెరుగు వ‌ల్ల చ‌ర్మాన్ని ఎలా సంర‌క్షించుకోవ‌చ్చో ఆ చిట్కాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1. అరకప్పు పెరుగులో 1 టీస్పూన్‌ వేప పిండి, అర టీస్పూన్‌ నిమ్మరసం, 1 టీస్పూన్‌ ఆలివ్‌ నూనె కలిపి మిశ్ర‌మంగా చేసిన దాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు పట్టుకుచ్చుల్లా తయారవడంతో పాటు చుండ్రు సమస్య అదుపులో ఉంటుంది.

2. పెరుగులో మెంతిగింజల్ని రాత్రి నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. దానికి అరటీస్పూన్‌ తేనె, రెండు చుక్కల నిమ్మరసం కూడా కలుపుకుని వెంట్రుకలకు పట్టించాలి. అనంతరం కొంత సేపు ఆగాక స్నానం చేయాలి. ఇలా త‌రచూ చేస్తుంటే జుట్టుకి కొత్త నిగారింపు వస్తుంది.

3. పెరుగు చర్మానికి సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది. దీనికి 1 టీస్పూన్‌ చొప్పున శ‌నగపిండి, పెసరపిండి, తేనె కలిపి ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. అప్పుడే దుమ్ము, ధూళితో పాటు మృతకణాలు తొలగిపోయి నునుపుదనం మీ సొంతమవుతుంది.

4. పెరుగులో తమలపాకుని కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత కళ్లపై ఉంచుకుంటే వేడి హరించుకుపోయి తాజాగా కనిపిస్తాయి.

5. పావుకప్పు పెరుగులో అంతే పరిమాణంలో కలబంద గుజ్జు, 1 టీస్పూన్ శ‌నగపిండి, నిమ్మరసం, అర టీస్పూన్‌ బాదం నూనె కలిపి మెత్తగా చేసుకొని ముఖానికి పూతలా వేయాలి. ఇలా ఓ ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతివంతమవుతుంది.


logo