భద్రాచలం: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నవత అనే యువతికి హెల్పింగ్ హ్యండ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. నవత అనే యువతి కొన్ని ఏండ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ విషయాన్నిహెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు కిరణ్కు తెలుపడంతో స్పందించిన ఆయన సంస్థ సభ్యుల సహకారంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు రాధాకృష్ణ, తులసిరామ్, మీసాల గోపి, రాజసింహా, రాజేష్, రవి, మోహన్, కల్లూరు రాజా, సాయి నాగరాజు పాల్గొన్నారు.