e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News సబ్‌ స్టేషన్‌లో అగ్నిప్రమాదం : పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా

సబ్‌ స్టేషన్‌లో అగ్నిప్రమాదం : పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా

భద్రాద్రి కొత్తగూడెం : భదాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారామపురం సబ్‌స్టేషన్‌లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా సబ్‌ స్టేషన్‌లో మంటలు చెలరేగి చుట్టుపక్కల వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం కారణంగా సబ్‌ స్టేషన్‌లోని పలు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిబూడిదయ్యాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎంత ఆస్తి నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana