e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిల్లాలు చిలక పచ్చని కాపురాలు

చిలక పచ్చని కాపురాలు

చిలక పచ్చని కాపురాలు

పెట్రాంచెలక గుంపులోచిలకా గోరింకలు!
అక్కడ కట్నకానుకలు లేని వివాహాలు..
గ్రామ పెద్దల సమక్షంలోనే సమస్యలకు పరిష్కారం
ఇతర గ్రామాలకు ఆదర్శం.. ఈ గూడెం పల్లె పెద్దలకు చెబు

ఇల్లెందు, ఏప్రిల్‌ 15 : అదొక అతి చిన్న గిరిజన గ్రామం. అడవిలో ఒక చివరన విసిరేసినట్లుగా ఉంటుంది. సుమారు వంద గడపలు. అక్కడంతా ఆదివాసీలే. అదొక అందమైన ప్రపంచం. కలుషితం లేని జీవనం. అక్కడి జనాలకు వరకట్నాలంటే తెలియదు. మనువుకు మనసే ప్రధానం. ఇద్దరూ ఇష్టాపడ్డారంటే పెళ్లి చేయాల్సిందే. పెళ్లయిందంటే.. వారిద్దరూ ‘చిలకాగోరింక’లన్నట్లే..! వారి మధ్య పొరపొచ్చాలుండవు. గొడవలుండవు. వేధింపులుండవు. అంత చక్కగా, చిక్కగా వారి సంసార జీవితం సాగిపోసంప్రదాయబద్ధంగా వేడుకలు..
మంత్రాలు-పూజలు కాదు, తప్పట్లు-తలంబ్రాలు కాదు, కట్నాలు కానుకలు కాదు. ఇక్కడ ఇలాంటివేవీ ఉండవు. ఇక్కడ పెళ్లి వేడుకలో కొమ్ముడోలు.. కోయ నృత్యాలు.. రేలా పాటలు ఉంటాయి. ఓ అబ్బాయి-అమ్మాయి ఒకరినొకరు మనసు ఇచ్చిపుచ్చుకున్నారంటే.. ముందుకు తమ ఇంటి పెద్దలకు (తల్లిదండ్రులకు) చెబుతారు. సాధారణంగా వారు ఎలాంటి అభ్యంతరం తెలుపరు. సంతోషంగా అంగీకరిస్తారు. ఆ తరువాత చిలక పచ్చని కాపురాలు తారు. ఆ పెద్దలు, పూజారి తదితరులు కలిసి ఏదో ఒక రోజున రాత్రివేళ సమావేశమై తేదీ (ముహూర్తం) నిర్ణయిస్తారు. ఇదంతా వారం పది రోజుల్లోనే పూర్తవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఆస్తీఅంతస్థుల ప్రస్తావనే ఉండదు. కట్నకానుకల ప్రసక్తే ఉండదు.మగపెళ్లి వారికే ఖర్చులు..
ఆధునిక సమాజంలో పెళ్లనగానే.. వరకట్నం ప్రస్తావన ముందుకొస్తుంది. సాధారణంగా ఇతర పెళ్లిళ్లలో వధువు కుటుంబమే ఎక్కువ ఖర్చులు భరిస్తుంది. ఈ గూడెంలో వివాహం ఫిక్స్‌ అయ్యాక ఆడపిల్ల తండ్రికి ఒకవేళ ఆర్థిక ఇబ్బందులుంటే.. అబ్బాయి తరఫు వాళ్లు పెళ్లి తంతు జరిపిస్తారు. ఇందుకయ్యే ఖర్చును వీరి భాషలో ‘ఓలి’ అంటారు. పెళ్లి నిశ్చయానికి ముందే అబ్బాయి కుటుంబీకులు దీనిని ప్రకటిస్తారు. అబ్బాయి-అమ్మాయి.. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారైతే ఖర్చు తగ్గుతుంది. వేర్వేరు గ్రామాల వారైతే ఖర్చు పెరుగుతుంది. అడవిలో వాగులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ గ్రామాలకు ఇవే సరిహద్దులుగా ఉంటాయి. ఆ రెండు గ్రామాల మధ్యన దూరాన్నిబట్టి ‘వాగు’ ఖర్చు ఉంటుంది. ఉదాహరణకు.. ఆ గ్రామాల మధ్యన మూడు వాగులు ఉన్నాయని అనుకుందాం. వాగుకు ఇంత అని అబ్బాయి తరఫు వాళ్లు లాంఛనం ఇవ్వాల్సిందే. ఎన్ని వాగులుంటే అంత ఖర్చు.
అన్యోన్య దాంపత్యం..
ఒక్కసారి పెళ్లయిందంటే.. ఆ జంట సంసారిక జీవితాంతం చిలకాగోరింకల్లాగా పచ్చగా సాగుతుంది. విడిపోవడమనేది ఉండదు. “పెళ్లయిన జంట విడిపోవడమనేది ఇప్పటివరకూ జరగలేదు” అని, ఈ గ్రామ పెద్ద ఒకరు చెప్పారు. అనివార్య కారణాలతో విడిపోవాల్సి వస్తే&!? “ఇక్కడ అలా జరగలేదు. చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడక్కడా జరిగింది. కుల పెద్దలతో చెప్పి విడిపోతారు. కొంత కాలం తరువాత మనసులు కలిస్తే.. మళ్లీ కలిసి జీవిస్తారు. అంతేతప్ప విడాకుల కోసం పంచాయితీలు, కొట్లాటలు ఉండవు” అని ఈ గ్రామ పెద్ద చెప్పారు. మనసుకు, మనువుకు చదువు-ఉద్యోగం వంటివి ఏమాత్రం ఆటంకంగా మారలేదు. అందుకే ఈ కుగ్రామం ఆదర్శంగా నిలిచింది.తుంది. “మేము ఆడవాళ్లను గౌరవిస్తాం, విలువనిస్తాం. ఇది మా ఆచారం” అని అక్కడి పెద్ద ఒకరు చెప్పారు.
ఈ రెండు మాటలనుబట్టే అర్థం చేసుకోవచ్చు.. అక్కడి ఆడవాళ్లు ఎంత ఆనందంగా ఉంటారో చెప్పడానికి. మనం ఒక్కసారి ఆ పల్లెకు వెళ్లొద్దాం.. అది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం భద్రుతండా పంచాయతీలోని పెట్రాంచెలక గుంపు గ్రామం. అడవిలో ఒక మూలన విసిరేసినట్టుగా ఉంటుంది. దాదాపుగా వంద ఇళ్లు ఉంటాయి. అందరూ ఆదివాసీ గిరిజనులే. అక్కడ దాదాపుగా ప్రతి ఒక్కరిదీ ప్రేమ వివాహమే. పెళ్లీడుకొచ్చిన అమ్మాయి-అబ్బాయి ఒకరినొకరు మనసు పడ్డారంటే.. వారికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పరు. ఆ ఊరి పెద్దలు పెళ్లి చేసేస్తారు. మన ‘ఆధునిక’ ప్రపంచంలో మాదిరిగా వారికి అంతస్థుల వంటి పట్టింపులేవీ ఉండవు. అంతా ఒకటే. అందరూ సమానమే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చిలక పచ్చని కాపురాలు

ట్రెండింగ్‌

Advertisement