e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు ఖమ్మం సర్కారు దవాఖానలో..పోలీసు సహాయ కేంద్రం

ఖమ్మం సర్కారు దవాఖానలో..పోలీసు సహాయ కేంద్రం

ఖమ్మం సర్కారు దవాఖానలో..పోలీసు సహాయ కేంద్రం

ఖమ్మం సిటీ, మే 5: ఖమ్మం ప్రభుత్వాసుప్రతికి రోజువారీగా వచ్చే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్‌శాఖ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కొవిడ్‌ హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసింది. ఈ విభాగాన్ని శనివారం సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ ప్రారంభించారు. డెస్క్‌ వద్ద సెంటర్‌లో పోలీస్‌, మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఇక్కడ దవాఖానలోని వార్డులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి సమాచారం అందిస్తారన్నారు. కరోనా కట్టడి కోసం పోలీసులు అలుపు లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. పోలీసులు కొవిడ్‌ బారిన పడితే మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ (లా అండ్‌ ఆర్డర్‌) సుభాశ్‌చంద్రబోస్‌, హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో డాక్టర్‌ బి.శ్రీనివాసరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ ప్రసన్నకుమార్‌, ఖమ్మం టూటౌన్‌ సీఐ కరుణాకర్‌, అర్బన్‌ సీఐ వెంకన్నబాబు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఖమ్మం సర్కారు దవాఖానలో..పోలీసు సహాయ కేంద్రం

ట్రెండింగ్‌

Advertisement