అశ్వారావుపేట: అన్నపురెడ్డిపల్లి మండల వ్యాప్తంగా రేపటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తహసీల్దార్ భద్రకాళి తెలిపారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ…మండలానికి 5,725 బతుకమ్మ చీరెలు వచ్చాయని, వీటిని రేషన్డీలర్ల ద్వారా అన్ని గ్రామ పంచాయతీల్లో పంపిణీ చేస్తామన్నారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధుల సహకారంతో చీరెల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు.