ప్రజలకు ఏ కష్టం వచ్చినా తక్షణం స్పందించే గుణం ఆయనది..
మున్సిపాలిటీల అభివృద్ధి కేటీఆర్ కృషి ఫలితమే: ఇల్లెందు ఎమ్మెల్యే
ఇల్లెందు, జూలై 23: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు మంచి భవిష్యత్తు ఉందని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. శనివారం మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా శుక్రవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. సీఎం కేసీఆర్కు తగ్గ తనయుడు మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయంటే అది మంత్రి కేటీఆర్ కృషి ఫలితమేనని అన్నారు. ప్రజలు తమకు కష్టమొచ్చిందంటూ ట్విట్టర్ ద్వారా విన్నవించినా తక్షణమే స్పందించే గుణం కలిగిన నాయకుడు కేటీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మరింత పురోగమిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.