టాలీవుడ్ హీరోయిన్లకు బాలీవుడ్లో అడుగు పెట్టాలన్న కోరిక ఉన్నట్లే, బాలీవుడ్ భామలకు హాలీవుడ్ ఎంట్రీ కూడా పెద్ద స్వప్నమే. అయితే, అలాంటి కలలు కొందరికి మాత్రమే సాధ్యమవుతాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రియాంక చోప్రా అయితే చాలా సినిమాలు చేసేస్తున్నది. ఇప్పుడు అదే బాలీవుడ్ నుంచి ఆలియా భట్ హాలీవుడ్లో అడుగుపెట్టనున్నది. ఇంగ్లిష్ సినిమాలు చేసేందుకు ఆమె ఇటీవలే ఇంటర్నేషనల్ టాలెంట్ ఏజెన్సీ ‘విలియం మోరిస్ ఎండీవర్ (డబ్ల్యూఎంఈ)’తో ఒప్పందం చేసుకుందట. ఈ విషయాన్ని ఆ సంస్థ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపింది. ‘వెల్కమింగ్ ఆలియా భట్ ఆన్ బోర్డ్’ అంటూ తమ ఇన్‌స్టా పేజీలో రాసు కొచ్చింది. త్వరలోనే ఈ విషయాన్ని ఆలియా కూడా ప్రకటించనున్నది. ప్రస్తుతం ఆమె తెలుగులో రాజమౌళి ప్రతిష్ఠాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నది.