గురువారం 04 మార్చి 2021
Badradri-kothagudem - Jan 28, 2021 , 01:58:15

స్వచ్ఛ ఆటో

స్వచ్ఛ ఆటో

  • పట్టణాల్లో పారిశుధ్య చర్యలు   
  • ఆటోల్లో చెత్త సేకరణ
  • ప్రతి వార్డుకు ఒకటి చొప్పున..

ఉదయం 6 గంటల నుంచే పనులు పురపాలక సంఘాలను స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. చెత్తాచెదారం కనిపించకుండా పారిశుధ్య చర్యలకు శ్రీకారం చుట్టింది. చెత్తను సేకరించి ఒకచోట డంప్‌ చేసేందుకు స్వచ్ఛ ఆటోల కొనుగోలు చేసింది. 

కొత్తగూడెం అర్బన్‌, జనవరి 27: ఒకప్పుడు చెత్తాచెదారంతో దుర్గంధాన్ని తలపించే వార్డులు, మురుగునీరు రోడ్డుపై చేరి దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడేవారు. వ్యర్థాలు ప్రధాన రోడ్లపై వేయడంతో పాదాచారులు, వాహనదారుల రాకపోకలకు ఆటంకాలు కలిగేవి. ఇంట్లో నుంచి బయటకు వస్తే ముక్కుమూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఈ సమస్యలకు చెక్‌ పెట్టి సంపూర్ణ పారిశుధ్య పట్టణాలుగా తీర్చిదిద్దుతున్నది. ప్రతి మున్సిపాలిటీకి అవసరమైన నిధులను మంజూరు చేసి స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేస్తున్నది. ప్రతి మున్సిపాలిటీల్లో వార్డుల ఆధారంగా స్వచ్ఛ ఆటోలను అందజేశారు.  కొత్తగూడేనికి 36, పాల్వంచకు 24, ఇల్లెందు 24, మణుగూరుకు 23 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేశారు. ప్రతి వార్డుకు ఉదయం ఆరు గంటలకే చెత్తను ఎత్తేందుకు ఇంటి ముందుకు స్వచ్ఛ ఆటోలు వస్తున్నాయి. 

ఇంటి యజమాని నుంచే డ్రైవర్‌కు జీతం 

ప్రస్తుతం చెత్తను ఎత్తేందుకు వస్తున్న స్వచ్ఛ ఆటో డ్రైవర్‌ నెల జీతాన్ని తొలి మూడు నెలలు మున్సిపాలిటీలు చెల్లించనున్నాయి. ఆ తర్వాత ప్రతి ఇంటి యజమానే చెత్తను సేకరిస్తున్న డ్రైవర్‌కు జీతం ఇచ్చే ఆలోచనను మున్సిపల్‌ అధికారులు చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి రూ.30 నుంచి రూ.50లను వసూలు చేసి డ్రైవర్‌కు జీతం ఇచ్చేలా యోచిస్తున్నారు. 

పరిశుభ్రత అందరి బాధ్యత 

వార్డును, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలందరి బాధ్యత. మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆకాంక్ష ఉండాలి. 

- కాపు సీతాలక్ష్మి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

VIDEOS

logo