మీ సేవలు అమూల్యం

దమ్మపేట: జనవరి 26: ‘మీ సేవలు అమూల్యం’ అంటూ మండలంలోని పట్వారిగూడెం పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ ప్రత్యూషను, పార్కలగండి సర్పంచ్ కొర్సా సాగర్‌ను ప్రజాప్రతినిధులు, నాయకులు మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బందితో కలిసి ప్రజలకు వైద్య సేవలందించినందుకు డాక్టర్ ప్రత్యూషను పట్వారిగూడెం ఆసుపత్రి వద్ద పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. జడ్పీటీసీ సభ్యుడు పైడి వెంకటేశ్వరరావు, దమ్మపేట పంచాయతీ ప్రత్యేకాధికారి, వెటర్నరీ డాక్టర్ మన్యం రమేష్‌బాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, సర్పంచ్ మొగిలి అంజలి, ఉప సర్పంచ్ రెడ్డిమళ్ల నాగన్న తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, జడ్పీ చైర్మన్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్న పార్కలగండి సర్పంచ్ కొర్సా సాగర్‌ను ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు సనానించారు.
తాజావార్తలు
- భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య
- లవర్‌తో హోటల్లో గడిపేందుకు బాలికను కిడ్నాప్ చేసిన మహిళ
- విడాకులు వద్దు.. నా భర్తే ముద్దంటున్న నవాజుద్ధీన్ భార్య
- ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 !
- తృణమూల్‌కు గుడ్‌బై చెప్పిన మరో నేత
- రెండో డోస్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి
- మహేష్‌ను కాపీ కొట్టేసిన శర్వానంద్
- వారికి మిత్తితో సహా బదులిస్తాం : మంత్రి కేటీఆర్
- మహేష్ బాబును కాపీ కొట్టేసిన బర్త్ డే బాయ్ ..!
- ప్రభుత్వ పరంగా కబడ్డీకి ప్రోత్సాహం : మంత్రి ఎర్రబెల్లి