సోమవారం 08 మార్చి 2021
Badradri-kothagudem - Jan 27, 2021 , 02:17:55

ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం మనదే

ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం మనదే

కొత్తగూడెం సింగరేణి, జనవరి 26: ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం మనదేనని సింగరేణి డైరెక్టర్‌ (పా) చంద్రశేఖర్‌ అన్నారు. సింగరేణి హెడ్డాఫీస్‌లో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు. మహామహులు కసరత్తు చేసి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాశారన్నారు. సింగరేణి నుంచి ఏటా ఉత్పత్తి చేసే 650 లక్షల టన్నుల బొగ్గు  మన రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలతో పాటు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు కూడా సరఫరా అవుతున్నదన్నారు. సుమారు 2 వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలైన సిమెంట్‌, స్పాంజ్‌ ఐరన్‌, పేపర్‌, సిరమిక్స్‌, ఎరువులు, మందులు లాంటి కర్మాగారాల అవసరాలకు కూడా బొగ్గు సరఫరా చేస్తున్నామన్నారు. కోలిండియా వంటి మహారత్న కంపెనీలతో పోల్చి చూస్తే సింగరేణి దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తుందన్నారు. ఇదంతా కార్మికులు, ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషి ఫలితంగానే సాధ్యమైందన్నారు. ఏడాదికి సగటున 9 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును రాష్ట్ర అభివృద్ధికి అందిస్తున్నామన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో ఎంతో ప్రగతిని సాధిస్తూ బహుముఖ వ్యాపార విస్తరణలతో ముందుకుపోతోందని అన్నారు.

VIDEOS

logo