రైతు కల్లాలను సకాలంలో పూర్తి చేయండి

చండ్రుగొండ, జనవరి 23: రైతు కల్లాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను జడ్పీ సీఈఓ విద్యాలత ఆదేశించారు. మండలంలోని తుంగారం, గానుగపాడు పంచాయతీల్లో రైతు కల్లాల నిర్మాణ పనులను శనివారం పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ...మండలానికి మంజూరైన 43 రైతు కల్లాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. వీటి నిర్మాణానికి రూ.13లక్షలను కలెక్టర్ అడ్వాన్సుగా ఇచ్చారని చెప్పారు. వీటిని రైతులకు వెంటనే చెల్లించి నిర్మాణ పనులను పూర్తి చేయించాలని ఆదేశించారు. ఎంపీడీవో స్వర్ణలత, ఎంపీపీ బానోత్ పార్వతి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్, జడ్పీటీసీ సభ్యుడు కొణకండ్ల వెంకటరెడ్డి, ఎంపీఓ తోట తులసీరాం, ఏపీవో ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
త్వరగా పూర్తి చేయాలి
ములకలపల్లి, జనవరి 23: వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పంట కల్లాల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని డీఆర్డీవో మధుసూదన్‌రాజు అన్నారు. శనివారం ములకలపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనులను నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్నారు. ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. అనంతరం పూసుగూడెం పంచాయతీ నర్సరీని, జగన్నాధపురంలోని పంట కల్లాలను పరిశీలించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో నాగేశ్వరరావు, ఏపీవో విజయలక్ష్మి, ఈసీ వీరభద్రం, టీఏలు ఉన్నారు.
తాజావార్తలు
- అంతర్గాలం
- మళ్లీ గ్రే లిస్ట్‌లోనే పాక్
- నేడు దేశవ్యాప్త బంద్
- శభాష్ నర్సింలు..
- ఒక్క రోజు నెట్ బిల్లు రూ. 4.6 లక్షలు
- జాగ్రత్తతో సైబర్‌నేరాలకు చెక్: సీపీ సజ్జనార్
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..
- వేసవి తట్టుకునేలా.. మరో సబ్‌స్టేషన్
- ఎంఎస్ఎంఈ ద్వారా ఆన్లైన్లో టాయ్ ఫేయిర్