శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Badradri-kothagudem - Jan 24, 2021 , 02:44:30

నేతాజీ ఆశయాలు అందరికీ ఆదర్శనీయం

నేతాజీ ఆశయాలు అందరికీ ఆదర్శనీయం

సారపాక, జనవరి 23: నేతాజీ ఆశయాలు నేటికీ అందరికీ ఆదర్శనీయమని భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌ అన్నారు. సుబాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా నేతాజీ సేవాసమితి ఆధ్వర్యంలో భద్రాచలం తాతగుడి సెంటర్‌లో ఉన్న నేతాజీ  విగ్రహానికి ఏఎస్పీ వినీత్‌, కంచర్ల గోపన్న సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దగ్గుబాటి విజయగోపాల్‌ పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడా రు. నేతాజీ ఆశయాలు యువతతో పాటు జాతి మొత్తానికి ఆదర్శనీయమన్నారు. అనంతరం ఏఎస్పీ, సీఐ స్వామిని నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో నేతాజీ సేవాసమితి సభ్యులు బాదం జగదీశ్‌, చారుగుళ్ల వెంకట్‌, రామారావు, బచ్చు ప్రసాద్‌, బుల్లిస్వామి, సుబ్బారావు, బోనాల ప్రసాద్‌, రామకృష్ణ, వీవీఎస్‌, టీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బూర్గంపహాడ్‌లో..

బూర్గంపహాడ్‌, జనవరి 23: సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని శనివారం బూర్గంపహాడ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో  నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌ వెంకటేశ్వరరావు నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, సత్యేంద్రకుమార్‌, శ్రీనివాస్‌, హుస్సేన్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo