మంగళవారం 02 మార్చి 2021
Badradri-kothagudem - Jan 24, 2021 , 02:30:47

రిజర్వేషన్లపై హర్షం

రిజర్వేషన్లపై హర్షం

  • ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లపై సంబురాలు
  • ఈడబ్ల్యూఎస్‌తో సమ సమాజ స్థాపనకు బాటలు 
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు 
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఓసీ సంఘాల కృతజ్ఞతలు

 కొత్తగూడెం, ఖమ్మం, పాల్వంచ, జనవరి 23 : రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు పది శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లను 60శాతానికి పెంచడం శుభపరిణామమని, దీనిద్వారా అగ్రవర్ణాల నిరుపేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధికి బాటలు పడనున్నాయని వాపోతున్నారు. బ్రాహ్మణ, వైశ్య, వెలమ, రెడ్డి, కమ్మ, మార్వాడీ, మార్వాడీజైన్‌, ముస్లిం మైనార్టీల్లో సయ్యద్‌, ఖాన్‌ మొదలైన వర్గాలకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి.. శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం పట్ల అగ్రవర్ణాల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో పలు సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సమ సమాజ స్థాపన కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ అన్నారు. టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధి దినేష్‌, నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, నాయకులు తాజుద్దీన్‌, కృష్ణచైతన్య, సుబ్బారావు, రాంమెహ్మన్‌రావు, లక్ష్మీసుజాత తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీకి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్‌రావు క్షీరాభిషేకం చేశారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌రావు, నాయకులు మండె వీరహన్మంతరావు, వీరయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు శాంతి, విజయలక్ష్మి, దామోదర్‌, పరంజ్యోతిరావు, జగన్‌, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ పట్టణంలో డీసీఎంఎస్‌ వైస్‌ ఛైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్‌ ఆధ్వర్యంలో అగ్రవర్ణ పేదలు కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంచిపెట్టి బాణాసంచా కాల్చారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీరాంమూర్తి, జడ్పీటీసీ సభ్యుడు బరపటి వాసుదేవరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కిలారు నాగేశ్వరరావు, సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్‌, వైస్‌ ఎంపీపీ మార్గం గురవయ్య, నాయకులు విశ్వనాథం, ముత్తయ్య, రామలింగం, ఎస్వీఆర్‌కే ఆచార్యులు, ప్రకాష్‌, సంతోష్‌ గౌడ్‌, నాగరాజు పాల్గొన్నారు. 

మా అదృష్టం

సీఎం కేసీఆర్‌ సార్‌కు మేం ఎల్లకాలం రుణపడి ఉంటాం. మాలాంటి అగ్రవర్ణ పేదలను గుర్తుంచుకుని ప్రత్యేక రిజర్వేషన్‌ ఇవ్వడం చాలా సంతోషకరం. కేసీఆర్‌ సారును మేం జీవితాంతం గుర్తుంచుకుంటాం. 

- చవ్వా సంతోష్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థి, పాల్వంచ

సమాన అవకాశాలు 

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలు చేయడం అభినందనీయం. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో అగ్రవర్ణాల పేదలకు చదువు, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తాయి.  

 - చింతనిప్పు కృష్ణ చైతన్య(టీఆర్‌ఎస్‌ నాయకులు)

సీఎం కేసీఆర్‌ అందరివాడు..

ముఖ్యమంత్రికేసీఆర్‌ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేయడంతో అందరివాడు. ప్రజా సమస్యలు తెలిసిన గొప్ప సీఎం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను వివిధ పథకాలతో ఆదుకుంటున్నారు. అగ్రకులాల్లో నిరుపేదలను ఆదుకునే లక్ష్యంతో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ అమలు చేయడం అభినందనీయం.  

-యండపల్లి వరప్రసాద్‌, ఖమ్మం రూరల్‌ జడ్పీటీసీ 

సీఎం సార్‌కు హ్యాట్సాఫ్‌

సీఎం సార్‌కు హ్యాట్సాఫ్‌. అగ్రవర్ణాల్లోని అనేకమంది ఆర్థికంగా వెనుకబడ్డారు. ఉన్నోళ్లకు ఎలాగూ అవసరం లేదు. లేనోళ్లను ఆదుకోవాలన్న నిర్ణయం శుభ పరిణామం. మా అందరి గుండెల్లో సీఎం కేసీఆర్‌ నిలిచిపోతారు.

- గుల్ల హేమంత్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థి, కొత్తగూడెం

VIDEOS

తాజావార్తలు


logo