శనివారం 27 ఫిబ్రవరి 2021
Badradri-kothagudem - Jan 23, 2021 , 02:15:10

గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం

గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం

  • భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌

సారపాక, జనవరి 22: భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులను స్వయం ఉపాధి రంగంలో అభివృద్ధి చేసి వారి కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ఐటీడీఏ లక్ష్యమని, ఇందుకు నిరంతర కృషిచేస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో టేకులపల్లి మండలం వెంకటయ్యతండాకు చెందిన మాలోతు భద్రు అనే గిరిజన వికలాంగునికి ట్రైకార్‌ ద్వారా మంజూరైన టైలరింగ్‌ యూనిట్‌ పత్రాలను పీవో అందజేసి మాట్లాడారు. గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ గిరిజనుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఎకనామికల్‌ సపోర్ట్‌ స్కీమ్‌, డీసీసీబ్యాంకు రుణ సౌకర్యంతో ఐటీడీఏ రాయితీ రూ.80వేలు డీసీసీబీ బ్యాంక్‌ రుణం రూ.20వేలు టైలరింగ్‌ యూనిట్‌కు అందించామని తెలిపారు.  ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా చర్యలు చేపడుతున్నట్లు పీవో తెలిపారు.  కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో జనరల్‌ కుమ్రం నాగోరావ్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo