ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Badradri-kothagudem - Jan 22, 2021 , 02:09:42

ఉదయం 11 గంటలకే బడి మూత

ఉదయం 11 గంటలకే బడి మూత

  • రేగుల పాఠశాలపై పర్యవేక్షణ... 
  • విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులకు దూరం

కరకగూడెం, జనవరి 21: కరోనా కారణంగా ప్రాథమిక, గిరిజన పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు చేరుకుని గ్రామాల్లో పర్యటించాల్సి ఉండగా, 4 గంటలకు తిరిగి పాఠశాలలు మూసివేయాల్సి ఉండగా మండల పరిధిలోని రేగుళ్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం ఎప్పుడు బడికి వస్తారో తెలియదు గానీ గురువారం 11 గంటలకే తాళం వేసి ఉన్న బడి ‘నమస్తే’కు కనిపించింది.విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ఎంఈవో వీరస్వామిని వివరణ కోరగా రేగుళ్ల పాఠశాలకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారని, ఒక రోజు స్కూల్‌ తెరిస్తే మరొక రోజు మూసివేస్తామని ఆయన జవాబువ్విటం కొసమెరుపు. 

VIDEOS

logo