ప్రకృతి వనాలు, ఎవెన్యూ ప్లాంటేషన్లు తనిఖీ

అశ్వారావుపేట టౌన్, జనవరి 20: ఉపాధి హామీ, పంచాయతీల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనాలు, ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ పనులను బుధవారం కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం మండలంలో తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా అశ్వారావుపేట మేజర్ పంచాయతీ, తిరుమలకుంట పంచాయతీల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు, పంచాయతీ నర్సరీలతో పాటు ప్లాంటేషన్, డంపింగ్ యార్డు వంటి పనులను పరిశీలించి పనులు, లోపాలను నమోదు చేసుకున్నారు. సేకరించిన వివరాలతో కూడిన నివేదికను కమిషనర్‌కు ఆన్లైన్లో ఉన్న ప్రదేశం నుంచి పంపిస్తామని ఖమ్మం ఏపీడీ పి శ్రీనివాసరావు, కొత్తగూడెం ఏపీడీ వలపర్ల ఉదయ్‌కుమార్ స్పష్టం చేశారు. మేజర్ పంచాయతీ ప్రకృతి వనం నిర్వహణ పనులు బాగున్నాయని వారు తెలిపారు. ఈ తనిఖీలో సర్పంచ్ అట్టం రమ్య, సున్నం స్వర్ణకుమారి, ఏపీఓ శ్రీను, ఈసీ రామచంద్రరావు, ఈఓ గజవెల్లి హరికృష్ణ, రమేశ్, ప్రేమ్ ఉన్నారు.