శనివారం 06 మార్చి 2021
Badradri-kothagudem - Jan 21, 2021 , 02:33:28

బెటాలియన్‌లో కుక్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు

బెటాలియన్‌లో కుక్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు

లక్ష్మీదేవిపల్లి, జనవరి 20: మండలంలోని చాతకొండలో ఉన్న 6వ బెటాలియన్‌లో కుక్‌ పోస్టుకు ఇంటర్వ్యూలు బుధవారంతో ముగిశాయి. మొత్తం 19 ఖాళీలకు గాను 41 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 36 మంది హాజరయ్యారు. టీఎస్‌ఎస్‌పీ హెడ్డాఫీస్‌ మేరకు కమిటీ సభ్యులను నిర్ణయించి ఇంటర్వ్యూలు చేశారు. కార్యక్రమంలో 15వ బెటాలియన్‌ కమాండెంట్‌ బి.రాంప్రకాశ్‌, 6వ బెటాలియన్‌ కమాండెంట్‌ వీవీ రమణరెడ్డి, అడిషనల్‌ కమాండెంట్‌ సుబ్రహ్మణ్యం, ఏవో అశోక్‌కుమార్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ పి.కృష్ణప్రసాద్‌, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo