15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం

కొత్తగూడెం సింగరేణి, జనవరి 20: సింగరేణి రామగుండం-3 ఏరియా పరిధిలో నిర్మాణంలో ఉన్న 50 మెగావాట్ల సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ నుంచి మరో 15 మెగావాట్ల సోలార్ విభాగాన్ని బుధవారం టీఎస్ ట్రాన్స్‌కోకు అనుసంధానం చేసినట్లు సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ తెలిపారు. ఈ విద్యుత్ ప్లాంట్‌ను సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు ప్రారంభించారు. ఇప్పటికే 50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ నుంచి గత నవంబర్ 27న 15 మెగావాట్లు గ్రిడ్‌కు అనుసంధానం చేశామని, దీంతో రామగుండం-3లో సోలార్ ప్లాంట్ నుంచి మొత్తం 30 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి ట్రాన్స్‌కోకు అనుసంధానం అయిందన్నారు. మొదటి దశలో 129 మెగావాట్ల సామర్థ్యంలో ఇప్పటికే 85 మెగావాట్ల సింగరేణి సోలార్ పవర్ట్రాన్స్కోకు అనుసంధానమైందన్నారు. ఈ ప్లాంట్‌లో ఇంకా మిగిలిన 20 మెగావాట్ల విభాగాన్ని వచ్చే నెల చివరికల్లా అనుసంధానం చేస్తాన్నారు. 15 మెగావాట్ల సోలార్ వి ద్యుత్ అనుసంధానంపై ఆయన సంబంధిత అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.ఆర్జీ-3 ఏరియా జీఎం సూర్యనారాయణ, జీఎం సోలార్ డీవీఎస్ఎస్ఎన్ రాజు, బీహెచ్ఈఎల్ ఏజీఎం సుభాస్ భన్వాలికర్ పాల్గొన్నారు.
నైనీ గనికి ప్రజల సానుకూలత
కొత్తగూడెం సింగరేణి, జనవరి 20: ఒడిస్సా రాష్ట్రంలో సింగరేణి సంస్థ ప్రారంభించనున్న భారీ బొగ్గు గని నైనీ బ్లాక్‌కు బుధవారం ప్రభుత్వ అధికారుల సమక్షంలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు పూర్తి సానుకూలతతో తమ అంగీకారం తెలిపారు. దీనిపై సంస్థ సీఎండీ హర్షం వ్యక్తం చేస్తూ ఒడిస్సా ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఒడిస్సాలోని అంగూల్ జిల్లా కరోడ్ బహాల్ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సంతోశ్‌కుమార్ ప్రధాన్, సబ్ కలెక్టర్ బాసుదేవ్ సత్పథి, పొల్యూషన్ బోర్డు రీజినల్ ఆఫీసర్ అనూప్ కుమార్ మాలిక్‌ల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయాన్ని ఆహ్వానించారు. సింగరేణి నుంచి అడ్వైజరీ నైనీ బ్లాక్ సీహెచ్ విజయారావు, కన్సల్టెంట్ ధరణి ధరణ్ నాథ్, పీవో రవీంద్రచౌదరి, సింగరేణి అధికారులు, సుమారు 500 మంది స్థానికులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) చంద్రశేఖర్‌రావు
కొత్తగూడెం సింగరేణి, జనవరి 20: ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కొవిడ్19 వ్యాక్సినేషన్ వేయిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం ఆయన ‘నమస్తే’తో మాట్లాడుతూ.. సుమారు 4వేల మందిని గుర్తించి టీకాలు వేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల సింగరేణి యాజమాన్యం నిర్వహించిన ఎక్స్టర్నల్ పరీక్షలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు బుధవారం జరిగిన ఇండక్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనుభవజ్ఞులైన సీనియర్ల మార్గదర్శకంతో సంస్థను లాభాల్లో నడిపించడంలో ప్రతిభను ప్రదర్శించాలన్నారు.
తాజావార్తలు
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి సాధ్యమేనా?!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్‌కు చిక్కులే!
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ఎంటర్టైనింగ్గా 'షాదీ ముబారక్' ట్రైలర్
- ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ పడిపోబోయిన సీఎం మమత
- ఘట్కేసర్ ప్లైఒవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
- 82 వేల హ్యుండాయ్ కోనా ఈవీల రీకాల్.. అందుకేనా?!
- దారుణం : కురుక్షేత్ర హోటల్లో బాలికపై సామూహిక లైంగిక దాడి