శనివారం 27 ఫిబ్రవరి 2021
Badradri-kothagudem - Jan 20, 2021 , 02:34:00

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

  • కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

పాల్వంచ, జనవరి 19: ప్రభుత్వ వసతి గృహాల్లో చదువునే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి హెచ్చరించారు. పాల్వంచలోని తెలంగాణ గురుకుల కళాశాలను మంగళవారం ఆయన పరిశీలించారు.  ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో   గురుకుల కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు ఆరుబయట స్నానాలు చేయడం, మరుగుదొడ్లకు నల్లా కనెక్షన్లు ఎందుకు ఏర్పాటు చేయలేని ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి వెంటనే సొషల్‌ వెల్ఫేర్‌ రీజనల్‌ కో ఆర్డినేటర్‌తో మాట్లాడి ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సూచించారు.  డీఈవో సోమశేఖర శర్మ, జిల్లా వైద్యాధికారి భాస్కర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ పులిరాజు, ఎంపీపీ సరస్వతి, స్పెషలాఫీసర్‌ సత్యప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, ఎంపీడీఓ అల్‌బర్ట్‌, ఎంఈఓ శ్రీరామ్మూర్తి, లక్షీదేవిపల్లి సర్పంచ్‌ విజయ్‌కుమార్‌, ఎంపీటీసీ వీరమోహన్‌రావు పాల్గొన్నారు. 

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ 

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్‌  ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పక్రియపై సంబంధిత ప్రోగ్రాం అధికారిణి  సకృతను కలెక్టర్‌ వివరాలు అడగ్గా సరైన సమాధానం చెప్పకపోవడంతో షోకాజ్‌ నోటీసు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.  


VIDEOS

logo