సోమవారం 08 మార్చి 2021
Badradri-kothagudem - Jan 20, 2021 , 02:33:58

వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు

వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు

జూలూరుపాడు, జనవరి 19: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ టీకా కేంద్రాన్ని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ మంగళవారం ప్రారంభించారు. మొదటి వ్యాక్సిన్‌ను మెడికల్‌ ఆఫీసర్‌ వీరబాబుకు ఇచ్చారు. అనంతరం వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు.  

సింగరేణి వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభం

కొత్తగూడెం సింగరేణి, జనవరి 19: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దని, వ్యాక్సిన్‌ వేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని సింగరేణి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మంతా శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ను ప్రారంభించి తొలి వ్యాక్సిన్‌ను సీఎంవో వేయించుకొని అందరికీ ధైర్యం చెప్పారు. 

చుంచుపల్లి, జనవరి 19: మండలంలోని పెనగడప పీహెచ్‌సీలో కొవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంగళవారం జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీపీ బాదావత్‌ శాంతి ప్రారంభించారు. తొలి వ్యాక్సిన్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌వో వేయించుకున్నారు.

సుజాతనగర్‌, జనవరి 19: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంగళవారం ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి ప్రారంభించారు. వైద్యాధికారిణి నాగమణి తొలి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌ పరిశీలించారు. 

కొత్తగూడెం జనవరి 19: అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ సఫాయిబస్తీలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రారంభమైంది. వార్డు కౌన్సిలర్లు పి సత్యనారాయణ చారి, బండి నరిసింహారావు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. వైద్యులు నేహ అమ్రిన్‌, సయ్యద్‌ పాషా, సీఓ శారద, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి, అంగన్‌వాడీ టీచర్లు వ్యాక్సిన్‌ వేసుకున్నారు.

VIDEOS

logo