ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి

- యువతకు దేశభక్తి చాటుకునే సువర్ణావకాశం
- ఉచిత ఆర్మీ శిక్షణ ఎంపిక కార్యక్రమంలో సింగరేణి జీఎంలు
కొత్తగూడెం సింగరేణి, జనవరి 19: దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ దేశభక్తిని చాటుకునే అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం నరసింహారావు, జీఎం పర్సనల్ కె.బసవయ్య అన్నారు. మంగళవారం కొత్తగూడెం కార్పొరేట్‌లోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత ఆర్మీ శిక్షణ శిబిరానికి అభ్యర్థుల ఎంపికను వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి పరిసర ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు మార్చి 5 నుంచి 24వ తేదీ వరకు మేడ్చల్ జిల్లా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందన్నారు. ఇందులో ఉద్యోగాలు సాధించేందుకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఈ శిబిరంలో శిక్షణ పొందేందుకు కార్మికులు, మాజీ ఉద్యోగుల పిల్లలు, ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువత, పరిసర ప్రాంతాల యువతకు ఉద్యోగాలు అధిక సంఖ్యలో సాధించాలని ఆకాంక్షించారు. ఈ నెల 20 నుంచి 45 రోజుల పాటు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శిక్షణ ఇస్తారని తెలిపారు. మాజీ సైనికులు, అనుభవజ్ఞులైన కోచ్‌లతో యువతకు శిక్షణనిస్తారని అన్నారు. కొత్తగూడెం సీఈఆర్ క్లబ్లో జరిగిన ఈ ఎంపికలో రన్నింగ్, దేహదారుఢ్య పరీక్షలు, విద్యార్హతను పరిశీలించారు. ఈ ఉచిత శిక్షణకు 262 మంది యువకులు దరఖాస్తు చేసుకోగా 162 మంది అర్హత సాధించారు. వారిలో 156 మంది పులప్ శిక్షణకు ఎంపికయ్యారు. వీరికి సింగరేణి ప్రధాన ఆస్పత్రి వైద్య బృందం పరీక్షలు నిర్వహించి 108 మంది ఎంపిక చేయగా వీరిలో మెరిట్ ఆధారంగా 50 మందిని తీసుకున్నారు. ఎంపికైన వీరికి శిక్షణలో సమయంలో పాలు, పండ్లు, కోడిగుడ్లు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఎంపికైన వారిలో ఎవరైనా డ్రాపవుట్స్ ఉంటే తరువాత స్థానంలో ఉన్న అభ్యర్థులను తీసుకుంటారు. కార్యక్రమంలో ఏరియా ఎస్వోటు జీఎం నారాయణరావు, డీజీఎం పర్సనల్లు సామ్యూల్ సుధాకర్, ధన్పాల్ శ్రీనివాస్, సివిల్ సూర్యనారాయణ, ఫైనాన్స్ రాజశేఖర్, ఎస్ఎస్వో రమణారెడ్డి, వేణుమాధవ్, డీవైపీఎం కిరణ్‌బాబు, టీబీజీకేఎస్ ఏరియా, కార్పొరేట్ ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, ముప్పాని సోమిరెడ్డి, సీనియర్ పీవోలు బేతిరాజు, సుధాకర్, సంతోశ్, అనిల్, శ్రావణ్, సందీప్, శ్రీకాంత్, గట్టు స్వామి, సుశీల్‌కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్లు సుందర్రాజు, పాస్నెట్, కమ్యూనికేషన్ కో-ఆర్డినేటర్ సాయికృష్ణ, నాగరాజు, సేవా సమితి కో- ఆర్డినేటర్ షరీఫుద్దీన్, సంగారావు, సెక్యూరిటీ, క్లరికల్, సివిల్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి సాధ్యమేనా?!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్‌కు చిక్కులే!
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ఎంటర్టైనింగ్గా 'షాదీ ముబారక్' ట్రైలర్
- ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ పడిపోబోయిన సీఎం మమత
- ఘట్కేసర్ ప్లైఒవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
- 82 వేల హ్యుండాయ్ కోనా ఈవీల రీకాల్.. అందుకేనా?!
- దారుణం : కురుక్షేత్ర హోటల్లో బాలికపై సామూహిక లైంగిక దాడి