పట్టణ వేదిక.. ప్రగతి కానుక

- పట్టణ ప్రగతి అభివృద్ధి పనులతో సరికొత్త రూపు
- సిద్ధమవుతున్న ప్రకృతి వనం పార్కులు
- డివైడర్ల ముస్తాబు...
- కొత్తగా డంప్ యార్డులు, ఐదు నర్సరీల ఏర్పాటు
- చూడముచ్చటగా ప్రధాన కూడళ్ల్ల రూపకల్పన...
పట్టణ ప్రగతి పనులతో మణుగూరు మున్సిపాలిటీ రూపురేఖలు మారిపోతున్నాయి. అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. పట్టణం అందంగా కనిపించాలంటే ప్రప్రథమంగా రోడ్లు బాగుండాలి. వాటి రూపురేఖలు బాగుండాలి. ప్రధాన కూడళ్లు కనువిందుగా, ఉద్యానవనాలు(పార్కులు) చూపులకు ఇంపుగా-సొంపుగా ఉండాలి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా కనిపించాలి. ఇప్పుడు ఈ పనులన్నీ మణుగూరులో జరుగుతున్నాయి. వీటిని వివరంగా చూద్దాం.
మణుగూరు, జనవరి 19:
డివైడర్లు..
పట్టణంలోని ప్రధాన రహదారి మధ్యలో డివైడర్లు, వాటి మధ్యలో రకరకాల పూల మొక్కలు నాటే దుకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. ప్రధాన రహదారిపై డివైడర్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వాటి మధ్యలో పొడవైన మొక్కలు ఏపుగా పెరిగాయి. వీటిని మరింత అందంగా తీర్చిదిద్దే పనులు సాగుతున్నాయి. కడియం నుంచి తెచ్చిన అందమైన పూల మొక్కలను డివైడర్ల మధ్యలో నాటుతున్నారు.
- డ్రై రీసైకిల్ కలెక్షన్ సెంటర్(డీఆర్సీసీ) నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తిరిగి ఉపయోగించగలిగే వ్యర్థాలను సేకరించి ఇక్కడకు తీసుకొచ్చి రీసైక్లింగ్ చేస్తారు.
- పట్టణంలోని ప్రధాన రోడ్లు మాత్రమే కాదు, అంతర్గత రహదారులు కూడా బాగున్నప్పుడే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అందుకే, మణుగూరులోని అన్ని అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చేందుకు, వీధి లైట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది.
ఇంటింటికీ శుద్ధజలం..
పట్టణంలోని ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలం అందుతున్నది. రూ.25.56 కోట్ల వ్యయంతో తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరాయిగూడెం గ్రామ సమీపంలోని గోదావరి వద్ద నిర్మించిన ఇన్‌టెక్‌వెల్ నుంచి కమలాపురం వద్ద నిర్మించిన ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, గాంధీబొమ్మ సెంటర్, భగత్‌సింగ్‌నగర్ వద్ద ఏర్పాటు చేసిన ట్యాంకుల ద్వారా ప్రతి ఇంట్లోని నల్లాకు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం 40 కిలో మీటర్లకు పైగా డిస్టిబ్యూషన్ పైపులైన్, మరో 9 కిలోమీటర్ల మెయిన్ పైపులైన్ నిర్మించి 3 ఓహెచ్టీల ద్వారా మంచినీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం 13 వార్డులకు సరఫరా చేస్తుండగా మరో 7 వార్డులకు నీరందించేందుకు యుద్ధప్రాతిపాదికన పనులు జరుగుతున్నాయి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పనుల రూ.5కోట్లను విడుదల చేసింది. మొత్తం 20 వార్డుల్లో 4580 నల్లా కనెక్షన్లు ఉన్నాయి.
ప్రధాన కూడళ్ల సుందరీకరణ..
పట్టణ ప్రగతి పనుల్లో సుందరీకరణ ప్రధానమైనది. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లను పచ్చదనంతో, ఎల్ఈడీ వెలుగులతో సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నది.
ప్రజామరుగుదొడ్లు..
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, ఇళ్ల నుంచి బయటికొచ్చిన ప్రజలు ‘అత్యవసరాల’ కోసం ప్రత్యేకంగా రూ.34.20 లక్షల వ్యయంతో ప్రజా మరుగుదొడ్ల(పబ్లిక్ టాయ్‌లెట్స్)ను ప్రభుత్వం నిర్మించింది.
పార్కులు-వనాలు..
పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పట్టణ ప్రకృతి వనం, యాదాద్రి డెన్ పార్క్ సిద్ధమవుతున్నాయి. ఒక ఎకరం భూమిలో ఒకటి చొప్పున మొత్తం ఐదు నర్సరీలు ఏర్పాటవుతున్నాయి. వీటి కోసం ప్రభుత్వం రూ.16 లక్షలు కేటాయించింది. పట్టణ ప్రకృతి వనం పేరుతో ఐదు పార్కులు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ. 28.50లక్షలు వెచ్చిస్తున్నది. సువిశాలమైన ఈ నర్సరీలు, పార్కులు రకరకాల మొక్కలతో పట్టణానికి కొత్తందాలు తీసుకురానున్నాయి.
మినీ ట్యాంక్‌బండ్..
నాయుడు కుంట చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. చెరువు చుట్టూ పచ్చని మొక్కలు, పచ్చిక బయలు, వాకింగ్ ట్రాక్, జిమ్, పిల్లలు ఆడుకునేందుకు వస్తువులు, కూర్చునేందుకు సిమెంట్ బల్లలు, ఎల్ఈడీ లైట్లు& ఇలా సర్వాంగ సుందరంగా మినీ ట్యాంక్ బండ్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది.
అభివృద్ధికి కేరాఫ్‌గా..
“మణుగూరు పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోడ్లు, పార్కులు, వనాలు, మరుగుదొడ్లు, లైట్లు.. ఇలా అన్నీ సమకూరుతున్నాయి. డ్రెయిన్ల అభివృద్ధి పనులకు రూ.150 కోట్ల వ్యయ అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. మణుగూరు మున్సిపాలిటీని అందానికి-అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నది”.
-నాయిని వెంకటస్వామి, మణుగూరు మున్సిపల్ కమిషనర్
పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
“మణుగూరు పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందమైన, ఆదర్శమైన మున్సిపాలిటీగా మణుగూరు తయారవుతున్నది. మరిన్ని మౌలిక వసతుల కల్పనకు, కొత్తగా డ్రైనేజీ నిర్మాణానికి మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. తహసీల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.3 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు వెళ్లాయి. త్వరలోనే పూర్తిస్థాయిలో నిధులు మంజూరవుతాయి. ఇప్పుడు చేపట్టిన.. మున్ముందు చేపట్టనున్న పనులన్నీ పూర్తయితే.. మన మణుగూరు మునుపటిలా ఉండదు. సరికొత్తగా కళకళలాడుతుంది”.
- రేగా కాంతారావు,పినపాక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్
తాజావార్తలు
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి సాధ్యమేనా?!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్‌కు చిక్కులే!
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ఎంటర్టైనింగ్గా 'షాదీ ముబారక్' ట్రైలర్
- ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ పడిపోబోయిన సీఎం మమత
- ఘట్కేసర్ ప్లైఒవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి