మంగళవారం 09 మార్చి 2021
Badradri-kothagudem - Jan 18, 2021 , 00:12:31

నేడు మంత్రి ‘పువ్వాడ’ రాక

నేడు మంత్రి ‘పువ్వాడ’ రాక

  • పలు అభివృద్ధి పనులు ప్రారంభం
  • అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటన

అశ్వారావుపేట/దమ్మపేట, జనవరి 17: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సోమవారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించనున్నారు. ముందుగా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం అశ్వారావుపేట చేరుకొని 10.30 గంటలకు రైతు వేదిక, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ నూతన భవనం, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభిస్తారు. 11.45 గంటలకు దమ్మపేట మండలానికి చేరుకుంటారు. మండల కేంద్రంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, రైతు వేదిక,  దమ్మపేట నుంచి అచ్యుతాపురం వరకు బీటీ రహదారికి శంకుస్థాపన చేస్తారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జి తాటి వెంకటేశ్వర్లు, పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి పర్యవేక్షించారు.

దమ్మపేట, జనవరి 17: ఏజెన్సీ మండలమైన దమ్మపేటలో రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పర్యటనను జయప్రదం చేయాలని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు దొడ్డాకుల రాజేశ్వరరావు, దొడ్డా రమేశ్‌ ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11.30 గంటలకు దమ్మపేట మండల కేంద్రంలో పర్యటిస్తారని ముందుగా దమ్మపేట అర్భన్‌కాలనీలో బీటీ రహదారి పనులకు వారు శంకుస్థాపన చేస్తారని అనంతరం మల్లారంలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం దమ్మపేట, పట్వారిగూడెం, మల్కారంలో రైతువేదికలను ప్రారంభిస్తారన్నారు. పార్కలగండి గ్రామంలో రూ.22లక్షలతో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయాన్ని, పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభిస్తారని వారు తెలిపారు.  

అశ్వారావుపేట రూరల్‌, జనవరి 17: జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు సోమవారం అశ్వారావుపేటలో పలు అభివృద్ధ్ది పనుల ప్రారంభోత్సవం చేస్తారని, పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి కోరారు. అనంతారం, గాండ్లగూడెం, బచ్చువారిగూడెం, నారాయణపురం, ఆసుపాక గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు.

నేడు మండలంలో ఎంపీ నామా పర్యటన 

చండ్రుగొండ, జనవరి17: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సోమవారం మండల పర్యటన ఖరారైనట్లు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మాలోత్‌ భోజ్యనాయక్‌ ఆదివారం తెలిపారు. మద్దుకూరు, దామరచర్ల, చండ్రుగొండ, తిప్పనపల్లి గ్రామాల్లో  పలువురిని పరామర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపీగా నామా నాగేశ్వరరావు మండలానికి మొదటిసారిగా వస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్‌ మండల కమిటీ, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

VIDEOS

logo