శనివారం 27 ఫిబ్రవరి 2021
Badradri-kothagudem - Jan 18, 2021 , 00:12:08

‘పేదింటి’ స్వప్నం సాకారం

‘పేదింటి’ స్వప్నం సాకారం

  • నేడు డబుల్‌ ఇళ్ల ప్రారంభోత్సవానికి లబ్ధిదారుల్లో మిన్నంటిన ఆనందం

దమ్మపేట, జనవరి 17: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లతో పేదింటి కల సాకారమైంది. దమ్మపేట మండలంలోని మల్లారం కాలనీలో ప్రభుత్వం ఇటీవల 20 డబుల్‌ ఇళ్లను నిర్మించింది. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ డబుల్‌ ఇళ్లను ప్రారంభించనున్నారు. 

సొంతింటి కల నెరవేరింది  

ఒకే ఇంట్లో కుటుంబాన్ని ఎలా గడపాలనే సమయంలో సీఎం కేసీఆర్‌ అందించిన ఇల్లు తన  జీవితంలో సుఖసంతోషాన్ని నింపింది. డబుల్‌ బెడ్‌రూం ఇంటికి దరఖాస్తు చేయడంతో అర్హురాలిగా ఉన్న తనను గుర్తించి డబుల్‌ బెడ్‌రూం ఇంటిని కేటాయించడంతో సొంతింటి కల నెరవేరింది.

-మొడియం నాగమణి, లబ్ధ్దిదారురాలు, మల్లారం కాలనీ, దమ్మపేట

గూడు.. నీడ దొరికింది  

సీఎం కేసీఆర్‌ పేదల ఇబ్బందులను గుర్తించారు. అర్హురాలిగా ఉన్న మాకు డబుల్‌ బెడ్‌రూం ఇంటిని కేటాయించారు. గూడు.. నీడ దొరికింది.. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. 

-గడ్డం కుసుమ, లబ్ధిదారురాలు, మల్లారం కాలనీ 

మలి విడతలో 200 ఇళ్లు 

ప్రభుత్వం దమ్మపేట ఏజెన్సీ మండలానికి తొలివిడతగా సీఎం కేసీఆర్‌ 120 డబుల్‌ ఇళ్లను మంజూరు చేసి ఇప్పటికే లబ్ధ్దిదారులకు అందజేశారు. అదేవిధంగా మలివిడతగా 200 డబుల్‌ ఇళ్లను మంజూరు చేయగా ఆ గృహాల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఆ గృహాలను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు గూడు కల్పించాలనే సదుద్ద్దేశంతో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయించింది. 

-తాటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే

VIDEOS

logo