మంగళవారం 02 మార్చి 2021
Badradri-kothagudem - Jan 16, 2021 , 01:02:17

వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం

వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం

  • జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య 

కొత్తగూడెం, జనవరి 15: ధైర్యంతో కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటూ ప్రజలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణలో దేశస్థాయిలో మన జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారని కొనియాడారు. జడ్పీ సీఈవో, ప్రజాప్రతినిధులకు, డీఆర్‌డీఏ పీడీ, మహిళా సంఘాల ద్వారా గ్రామస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి దశలో వ్యాక్సిన్‌ వేసేందుకు ఎంపిక చేసిన నాలుగు కేంద్రాల్లో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు.  అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌, విద్యుత్‌ ఎస్‌ఈ సురేందర్‌, జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్‌డీఏ మధుసూదన్‌రాజు, కరోనా సర్వెలెన్స్‌ ఆఫీసర్‌ చేతన్‌, వ్యాక్సిన్‌ ప్రత్యేక అధికారి నాగేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

VIDEOS

తాజావార్తలు


logo