జిల్లాకు చేరిన వ్యాక్సిన్

16వ తేదీ నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకాలు
జిల్లా కేంద్రాల నుంచి బూత్‌లకు పంపిణీ
ఉమ్మడి జిల్లాలో నిల్వ కేంద్రాలు : 63
టీకాల నిర్వహణ కేంద్రాలు : 79
విధుల్లో పాల్గొనేవారు : 995
వ్యాక్సిన్ వేసుకోనున్న సిబ్బంది 19,455
యావత్ ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌కు వ్యాక్సిన్‌తో చెక్ పడనున్నది. కరోనా మహమ్మారికి కళ్లెం వేసేందుకు తయారు చేసిన టీకా బుధవారం అర్ధరాత్రి జిల్లాకు చేరింది. ఈ నెల 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రత్యేక అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 21,794 మంది టీకాలు వేసుకునేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. వీరికి తొలివిడతలో టీకాలు ఇవ్వనున్నారు.
-ఖమ్మం, జనవరి 13,
(నమస్తే తెలంగాణ, ప్రతినిధి)
ఖమ్మం, జనవరి 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మరిని తరిమికొట్టే టీకాలు అత్యంత భద్రత మధ్య ఉమ్మడి జిల్లాకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని కోఠి ఇమ్యూనైజేషన్ బిల్డింగ్ నుంచి ఎస్కార్ట్‌తో బయలుదేరిన వ్యాక్సిన్ వాహనాలు బుధవారం అర్ధరాత్రి జిల్లాకు చేరుకున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని 63 కేంద్రాల్లో వీటిని భద్రపర్చారు. ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఈ నెల 16న ఖమ్మం జిల్లాలోని 35, భద్రాద్రి జిల్లాలోని 44 కేంద్రాల్లో వీటిని ఇవ్వనున్నారు. ఈ విధుల్లో మొత్తం 995 మంది అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం కోసం ఖమ్మం జిల్లాలో 11,918 మంది, కొత్తగూడెం జిల్లాలో 7,537 మంది సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం ప్రధాన ప్రభుత్వాసుపత్రిలోని తెలంగాణ డయాగ్నిస్టిక్ సెంటర్, మాతాశిశు సంక్షేమ కేంద్రాల్లోని డీప్ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేశారు.
ప్రతి సెంటర్ ప్రత్యేక టీం..
వ్యాక్సిన్ సెంటర్లలో ఓ వైద్యుడితోపాటు ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు నర్సింగ్, ఐసీడీఎస్ సిబ్బంది, ఓ పోలీసు కానిస్టేబుల్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. వ్యాక్సిన్ ఇచ్చాక ఎలాంటి దుష్ప్రభావం ఏర్పడినా తక్షణమే తరలించేందుకు వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. నిపుణులైన వైద్యులు అన్ని కేంద్రాల్లోనూ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
తొలి రోజు 30 మందికే..
టీకాల ప్రభావాన్ని, అనంతరం ఎదురయ్యే సమస్యలను అంచనా వేయడానికి, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో తొలి రోజు 30 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయాలని ఆధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే టీకాలను ఇవ్వనున్నారు. బుధ, శనివారాల్లో చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలను ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా వారంలో నాలుగు రోజులు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీటింగ్.. సెక్సస్ స్ఫూర్తితో..
జిల్లా యంత్రాంగం వ్యూహత్మకంగా వ్యవహరించి కరోనా నియంత్రణలో విజయం సాధించింది. ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీటింగ్ విధానంలో సఫలీకృతమయ్యారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఈ నెల 16న ఉమ్మడి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు.
అందుబాటులోకి ప్రత్యేక వాహనాలు..
డ్రై రన్‌ను దిగ్విజయం చేసిన సిబ్బంది.. ఈ నెల 16న వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. వ్యాక్సిన్ వేశాక ఆరోగ్య సమస్యలొస్తే ఎదుర్కొనేందుకోసం, వైద్య సహాయం కోసం ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. 108 వాహనాలు, ఆక్సిజన్, రియాక్షన్ ట్రీట్మెంట్ కిట్లను సిద్ధంగా ఉంచనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని కచ్చితంగా 30 నిమిషాలు అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉంటే ఇంటికి పంపిస్తారు.
తాజావార్తలు
- తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
- కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న హేమమాలిని
- టెస్ట్ చాంపియషిప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
- ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు
- బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే పార్టీలో ఘర్షణ.. ఇద్దరు మృతి
- పల్లా, వాణీదేవి లకు తొర్రూరు బ్రాహ్మణ సంఘం సంపూర్ణ మద్దతు
- ఇరగదీసిన అశ్విన్, అక్షర్.. నాలుగో టెస్ట్‌లో ఇండియా విక్టరీ
- గాలి సంపత్ కోసం రామ్, జాతి రత్నాల కోసం విజయ్..!
- బడ్జెట్ సమావేశాలపై సీఎం సమీక్ష
- ప్రగ్యా ఠాకూర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు