మంగళవారం 02 మార్చి 2021
Badradri-kothagudem - Dec 31, 2020 , 01:30:22

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి

  •  ఇంటిముందుకొచ్చే మున్సిపల్‌ వాహనంలోనే చెత్త వేయాలి
  •  స్వచ్ఛ ఆటోలు, వాకింగ్‌ ట్రాక్‌ ప్రారంభంలో మంత్రి అజయ్‌

కొత్తగూడెం అర్బన్‌: ప్రతి వార్డునూ పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజలపై కూడా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించే స్వచ్ఛ ఆటోలను స్థానిక ప్రగతిమైదాన్‌లో బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 

నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిల్‌ సభ్యులకు సూచించారు. పట్టణ ప్రజలు కూడా తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి ఉంచాలని, ఇంటి ముందుకు వచ్చే ఆటోల్లోనే ఆ చెత్తను వేయాలని సూచించారు. అనంతరం ప్రగతి మైదాన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వాకింగ్‌ ట్రాక్‌ను, ఓపెన్‌ జిమ్‌ను కలెక్టర్‌ ఎంవీ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

 ట్రాక్‌పై కొద్దిసేపు వాకింగ్‌ చేశారు. ట్రాక్‌ చాలా బాగుందంటూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌లను అభినందించారు. తర్వాత కొత్తగూడెం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (కేఎస్‌డీసీ) గురించి, న్యాక్‌ శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, డీఆర్‌డీఓ మధుసూదనరాజు, కొత్తగూడెం తహసీల్దార్‌ వర్సా రవికుమార్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo