మొనాకో: డోపింగ్ కేసులో అమెరికా స్టార్ అథ్లెట్ బ్రియానారోలిన్స్ మెక్‌నీల్‌పై ఐదేండ్ల నిషేధం పడింది. డోపింగ్ శాంపిల్స్‌ను ట్యాంపరింగ్ చేసిన కారణంగా మెక్‌నీల్‌పై వేటు వేసినట్లు అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్(ఏఐయు) శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కెరీర్లో రెండో సారి నిషేధం ఎదుర్కొంటున్న ప్రపంచ హార్డిల్స్ చాంపియన్ మెక్నీల్..టోక్యో ఒలింపిక్స్‌తో పాటు పారిస్(2024) విశ్వక్రీడలకు దూరం కానుంది. అయితే తమ నిర్ణయాన్ని క్రీడా అర్బిట్రేషన్ కోర్టు ప్రస్తుతానికి నిలిపివేయడంతో అమెరికా ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు మెక్నీల్కు అవకాశముందని ఏఐయు తెలిపింది. పూర్తి స్థాయి అప్పీల్ టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు వచ్చే చాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 100మీటర్ల హార్డిల్స్‌లో 12.26 సెకన్ల ప్రపంచ రికార్డు మెక్నీల్ పేరిట ఉంది.