అంతా 30 నిమిషాల్లోనే..

- పట్టాదారు పాస్ పుస్తకాలు చేతికి
- సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
- మొదటిసారి రెండు సేల్ రిజిస్ట్రేషన్లు
- స్వీట్లు పంపిణీ చేసిన అన్నదాతలు
జూలూరుపాడు: ఏజెన్సీ మండలమైన జూలురుపాడులో రెండు ధరణి సేల్ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ధరఖాస్తు చెసుకున్న రైతులకు 30 నిమిషాల్లో తహసీల్దార్, సజ్ రిజిస్టార్ పీ.ఎల్.ఎన్ ప్రసాద్ రిజిస్ట్రేషన్ పట్టా, 1-బీ పత్రాలను రైతులకు అందజేశారు. మండలంలోని కరివారిగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ కోట్యా కుటుంబ అవసరాల నిమిత్తం సుజాతనగర్ మండలంలోని నర్సింహసాగర్ గ్రామానికి చెందిన బానోత్ జానకిరామ్‌కు ఎకరం పది కుంటల భూమిని విక్రయించాడు. నవంబర్ 24న స్థ్ధానిక మీ సేవా కేంద్రంలో ధరణి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్డీవో కే ఫారమ్ జనరేట్ చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపగా ఈ నెల మూడో తేదీన ఎల్ ఫారమ్ జారీ అయినట్లు దరఖాస్తుదారుని మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. 5వ తేదీ 1.30 నిమిషాలకు స్లాట్ బుక్ చేసుకొని ఈ చలానా చెల్లించి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన 30 నిమిషాల్లో బానోత్ జానికిరామ్కు పట్టా పాస్ పుస్తకం, 1-బీ, సేల్ డీడ్ పత్రాలు, ఇరువురు అంగీకార పత్రాలను అందజేయడంతో ఆనందం వ్యక్తం చేశారు. మరో రిజిస్ట్రేషన్ మండల పరిధిలోని పడమటనర్సాపురం గ్రామానికి చెందిన రామ్‌సింగ్ ఎకరం పొలాన్ని అదే గ్రామానికి చెందిన మాళోత్ శోభన్‌కు విక్రయించాడు. గత నెలలో మీ సేవ కేంద్రంలో ధరణి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా 5 తేదీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి దరఖాస్తు చేసుకున్న రైతు శోభన్ చేతికి పట్టా పాస్ పుస్తకం, 1-బీ, సేల్ డీడ్ పత్రాలు, ఇరువురు అంగీకార పత్రాలను తహసీల్దార్ అందజేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో రైతుల హర్షం
ఏజెన్సీ మండలం అయిన జూలురుపాడులో రెండు సేల్ రిజిస్ట్రేషన్లు పూర్తై రైతుల చేతుల్లోకి పట్టా పాస్ పుస్తకం,1-బీ, సేల్ డీడ్ పత్రాలు ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతులు తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు, కార్యాలయానికి వచ్చిన వారికి సీట్లు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు.
రైతులకు వరం.. ధరణి
మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకున్న 30 నిమిషాల్లోనే అధికారులు పట్టాదారు, 1-బీ పత్రాలు చేతిలో పెట్టారు. ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు. ధరణి వైబ్‌సైట్ నిజంగా రైతులకు వరంలా మారింది. గతంలో భూమి కొంటే పట్టాదారు పాసుపుస్తకం మంజూరు కోసం కిందిస్థ్ధాయి నుంచి నానా కొర్రీలు పెట్టి కార్యాలయాల చుట్టూ తిప్పుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
-బానోత్ జానకిరాం
తాజావార్తలు
- చుక్కలు చూపించిన శార్దూల్, సుందర్.. టీమిండియా 336 ఆలౌట్
- కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు షురూ..
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
- ట్రంప్ ఆర్డర్లన్నీ రివర్స్.. బైడెన్ చేయబోయే తొలి పని ఇదే
- బైకును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
- ఆచార్యలో ‘సిద్ధ’గా రాంచరణ్.. లుక్ రివీల్
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?