ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కొత్తగూడెం సింగరేణి: సింగరేణి సంస్థ తన ‘లా’ విభాగంలో రెండు డిప్యూటీ లా మేనేజర్ పోస్టులకు, రెండు సీనియర్ లా ఆఫీసర్ పోస్టులకు అనుభవం ఉన్న (లిటరల్ ఎంట్రీ) వారిని నియమించడం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిప్యూటీ లా మేనేజర్ పోస్టుకు ఎల్ఎల్బీ/బీఎల్ 60 శాతం మార్కులతో పాసైన ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ అభ్యర్థి 12 సంవత్సరాల పాటు డిగ్రీ అనంతరం లీగల్ ప్రాక్టీషనర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. డిప్యూటీ లా మేనేజర్ పోస్టులకు ఎల్ఎల్బీ/బీఎల్ 60 శాతం మార్కులతో పాసైన ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ అభ్యర్థులు అర్హులు. ఎల్ఎల్ఎం పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడునని, ఈ విద్యార్హతలతో పాటు కనీసం 12 సంవత్సరాలు డిగ్రీ అనంతరం లీగల్ ప్రాక్టీషనర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. కనీస వయో పరిమితి 40 ఏళ్లు కాగా గరిష్ట వయో పరిమితి 45 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది). ఈ రెండు పోస్టులలో ఒకటి ఓసీ అభ్యర్థులకు, ఒకటి ఎస్సీ అభ్యర్థులకు రిజర్వు చేయబడింది.
తాజావార్తలు
- ‘ఎంజీఎంలో’ కొండెంగ.. కోతుల బెడద తప్పిందంటున్న సిబ్బంది
- ఎకరంలో 20 పంటలు.. లాభాలు గడిస్తున్న యువరైతు
- బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో సుమ ఫన్ షో.. వీడియో వైరల్
- ఆక్సిజన్ పార్కును ప్రారంభించనున్న మంత్రి హరీశ్
- కార్పొరేట్ల అనుకూల బడ్జెట్టే : వ్యవసాయ మంత్రి
- ఏఆర్ రెహమాన్‌ను కలిసిన టీమిండియా యంగ్ ప్లేయర్
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు
- ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్‌లో 10,811 పోస్టులు