కొత్తగూడెం జిల్లాకు స్కోచ్ అవార్డు

కొత్తగూడెం : కరోన నియంత్రణకు చేపట్టిన చర్యలకు గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్కోచ్ అవార్డుకు ఎంపికైంది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం స్కోచ్ అవార్డులను జారీ చేయాలని, ఇందుకోసం సంబంధించిన డాక్యుమెంటరీలను చేయాలని అన్ని రాష్ర్టాలకు సూచించింది. మన జిల్లాలో చేపట్టిన చర్యలపై రూపొందించిన డాక్యుమెంట్‌ను స్కోచ్ కమిటీ చైర్మన్ దీపక్ దుంజల్ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేయడం పట్ల కలెక్టర్ ఎంవీరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎంపిక ప్రక్రియపై శుక్రవారం ఢిల్లీ నుంచి కమిటీ సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న అనేక పరిశ్రమలకు వివిధ పనుల నిమిత్తం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వస్తువుల రవాణాకు వాహనాలు, వ్యాపారులు వస్తుంటారని,
అయినప్పటికీ పటిష్టమైన కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి స్కోచ్ అవార్డుకు ఎంపికైన ఏకైక జిల్లా మన భద్రాద్రి కొత్తగూడెం అని, మన డాక్యుమెంట్‌ను ఎంపిక చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ నియంత్రణ చర్యలు పాటించడం వల్ల వ్యాప్తిని చాలా వరకు కట్టడి చేయగలిగామన్నారు. 2వ వేవ్‌లో కూడా ప్రజలు పటిష్ట నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి వచ్చిన డాక్యుమెంటేషన్ ప్రఖ్యాత వ్యక్తుల సమక్షంలో మన జిల్లాలో చేపట్టిన చర్యలపై తయారు రూపొందించిన డాక్యుమెంట్‌ను వివరించారు.