సోమవారం 18 జనవరి 2021
Badradri-kothagudem - Dec 04, 2020 , 04:15:24

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మణుగూరు రూరల్‌: ఏరియాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం సాయంత్రం టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో ఏరియా జీఎం జక్కం రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా బ్రాంచి ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ కొవిడ్‌ నేపథ్యం లో ఉత్పత్తి ఉత్పాదకతలు తగ్గినందున ప్లేడేలు నిలిపారని అన్‌లాక్‌ అనంతరం కార్మికుల సమిష్టి కృషితో ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో గతంలో మాదిరిగా ప్లేడేలు పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో బ్రాంచి నాయకులు వీరభద్రయ్య, కోట శ్రీనివాసరావు, కాపా శివాజీ, వర్మ, సీహెచ్‌ వెంకటేశ్వరరెడ్డి, అశోక్‌ పాల్గొన్నారు.