సోమవారం 18 జనవరి 2021
Badradri-kothagudem - Dec 04, 2020 , 04:15:21

రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి

రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి

భద్రాచలం: కేంద్రం రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. ఈసందర్భంగా సీపీఎం, సీపీఐ పట్టణ కార్యదర్శులు గడ్డం స్వామి, ఏ సునీల్‌ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సాబీర్‌పాషా, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేశ్‌, న్యూడెమోక్రసీ నాయకుడు కెచ్చెల రంగారెడ్డి, వామపక్షాల గ్రాడ్యుయేట్‌ అభ్యర్థి జయసారధిరెడ్డి మాట్లాడారు. కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఛలో ఢిల్లీ కార్యక్రమానికి తరలివస్తున్న రైతాంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోలీసు బలగాలను పెట్టి బాష్పవాయువులతో దాడులు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు కే బ్రహ్మాచారి, ఎంబీ నర్సారెడ్డి, కోటేశ్వరరావు, అయోధ్య, టీ వెంకటేశ్వరరావు, కెచ్చెల కల్పన, బండారు శరత్‌బాబు, బీ కుసుమ, సీతాలక్ష్మి, సున్నం గంగ, నాగరాజు, మాధవ్‌, ఫిరోజ్‌, బీ సాయికుమార్‌, గణేశ్‌, గోపి, శ్రీను పాల్గొన్నారు.