సోమవారం 18 జనవరి 2021
Badradri-kothagudem - Dec 04, 2020 , 04:00:18

పచ్చని అందం.. పల్లె ప్రకృతి వనం..

పచ్చని అందం.. పల్లె ప్రకృతి వనం..

మణుగూరు: ప్రతి పల్లె పచ్చదనంతో వర్ధిల్లాలనేదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం.. రోజు రోజుకు పెరిగి పోతున్న కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేలా మెరుగై న జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్కులను ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతి పల్లెలో ప్రజలకు ఆహ్లాదం పంచేలా అన్ని రకాల హంగులతో పార్కులను సుందరీకరిస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో 118గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాల పార్కును ఏర్పాటుచేసి అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి వనాల పార్కుల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్ని రకాల పనులు చివరి దశలో ఉన్నాయి. మణుగూరు మండలంలో 14, పినపాక మండలంలో 23, భూర్గంపాడు మండలంలో 18, అళ్లపల్లిమండలంలో 12, గుండాల మండలంలో 11, కరకగూడెం మండలంలో16, అశ్వాపురం మండంలో24 పార్కులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నారు.  ఆయా గ్రామ పంచాయాతీల్లో ఏర్పాటు చేసిన పార్కుల అభివృద్ధి పనుల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రతి పార్కులో ప్రజలకు వాకింగ్‌ ట్రాక్‌తో పాటు వృద్దులు కూర్చునేందుకు బెంచిలు ఏర్పాటు వేస్తున్నారు. నీడనిచ్చే మొక్కలతో పాటు పూల మొక్కలను నాటి పెంచుతున్నారు.

పచ్చదనానికి సోపానం ‘పల్లెప్రకృతి వనం’

సారపాక:  ప్రకృతివనాలు పల్లె పచ్చదనానికి సోపానాలుగా మారి, ఆహ్లాదభరిత వాతావరణాన్ని కల్పించనున్నా యి. పట్టణాలకే పరిమితమైన పార్కులను పల్లెవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తున్న పల్లెప్రకృతి వనాలు అందుబాటులోకి వస్తున్నాయి. బూర్గంపహాడ్‌ మం డలంలో 17పంచాయతీలతో పాటు సారపాక పంచాయతీలో విలేజ్‌ పార్కుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా పల్లెపార్కుల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కో పార్కుకు రూ.4లక్షల నుంచి రూ.6లక్షల వరకు నిధు లు వెచ్చించి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పార్కులో అన్నిరకాల మొక్కలు నాటుతున్నారు. కూర్చునేందుకు వీలుగా బల్లలు, పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఊయ్యాలల ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి వరుసలో పెద్ద మొక్కలు, రెండో వరుసలో మధ్యస్థ మొక్కలు, మూడో వరుసలో పండ్ల మొక్కలు నాటుతున్నారు. వాటి పక్కన వాకింగ్‌ ట్రాక్‌(నడవడానికి వీలుగా రోడ్డు) నిర్మిస్తున్నారు. పల్లెవాసుల ప్రశాంతత కోసం ప్రకృతి వనాలకు వెళ్లి సేద తీరేందుకు వీలుగా నిర్మాణాలు చేపడుతున్నారు.

నందనవనాలుగా పల్లె ప్రకృతి వనాలు

చర్ల: ప్రకృతి అందాలకు ఆటపట్టయిన మన్యంలో ప్రకృ తి అందాలకు కొదువలేదు. ఈఅందాలకుతోడు ప్రభుత్వం సంకల్పంచిన పల్లె ప్రకృతి వనాలు నిర్మాణం మన్య ప్రాంతానికి మరో ఆకర్షణగా మారనున్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగమైన పల్లె ప్రకృతి వనాల నిర్మాణ పనుల ముమ్మరంగా జరుగుతున్నాయి. మండలంలో82 హ్యాబిటేషన్లకుగాను 81 హ్యాబిటేషన్లలో ఈజీఎస్‌ నిధులతో పాటు గ్రామ పంచాయతీల భాగస్వామ్యంతో పల్లె ప్రకృతి వనాల నిర్మాణం పనులు ఊపందుకున్నాయి.

అన్ని రకాల హంగులతో పార్కులు

ప్రతి గ్రామ పంచాయతీ ల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పం చేవిధంగా రాష్ట్ర ప్రభు త్వం పల్లె ప్రకృతి వనం పేరుతో పార్కులు ఏర్పా టు చేస్తుంది. ఇప్పటికే పార్కుల ఏర్పాటుకాగా పనులు ము మ్మరంగా జరుగుతున్నాయి. అన్ని రకాల హంగులతో పా ర్కులు రూపుదిద్దుకునేలా ప్రత్యేక దృష్టి పెట్టాను. ప్రతి గ్రామ పంచాయతీలో పార్కులు అందంగా తయారు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నా.

-ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

సేద తీరేందుకు అనువుగా

తీరిక సమయాల్లో సేద తీరేందుకు పల్లెప్రకృతి వనం ఉపయోగపడుతుం ది. పార్కులో పచ్చదనం నిండి ఉండే అవకాశం ఉం డటంతో వేసవిలో చుట్టుపక్కల పల్లెల ప్రజలు వచ్చి చెట్లు కింద గడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం పార్కుల ఏర్పాటు కోసం తమకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చి పంచాయతీ ప్రజలకు ఆహ్లాదభరిత వాతావరణం కల్పిస్తున్నాం.

- పోతునూరి సూరమ్మ, సర్పంచ్‌, మోతే పట్టీనగర్‌

స్వచ్ఛమైన ఆక్సిజన్‌ విలేజ్‌పార్కు 

పల్లెప్రకృతి వనాలతో స్వ చ్ఛమైన ఆక్సిజన్‌ లభిస్తుంది. ప్రభుత్వం ప్రతి పంచాయ తీ, పల్లెల్లో పార్కులు ఏర్పా టు చేయాలని సంకల్పించిం ది. పట్టణవాసులకు మాత్ర మే అందుబాటులో ఉన్న పార్కులు ఇప్పుడు గ్రామీణ పల్లెల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. భద్రాద్రి పుణ్యక్షేత్రం దగ్గరే ఉండటంతో పల్లెప్రకృతి వనం యాత్రికులకు సేదతీర్చేలా... ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దుతున్నాం. 

- కృష్ణ, ఈవో, సారపాక

చివరిదశలో నిర్మాణాలు

 మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు చివరిదశకు చేరాయన్నారు. ఎకరం స్థలంలో జరిగే పల్లె ప్రకృతి వనాలకు ఈజీఎస్‌ నిధులు రూ. 6. 46 లక్షలు, ఆరెకరం స్థలంలో నిర్మాణానికి 4.24 లక్షలు ఖర్చుచేస్తున్నాం. అదనంగా అయ్యే ఖర్చును గ్రామ పంచాయతీలు భరిస్తాయి. ప్రతి పార్కులో నీడనిచ్చే మొక్కలతో పాటు పూల మొక్కలను పెంచుతున్నారు.

- వివేక్‌రామ్‌, ఎంపీడీవో చర్ల