ఆదివారం 24 జనవరి 2021
Badradri-kothagudem - Dec 03, 2020 , 02:36:32

గెజిట్‌ విడుదల

 గెజిట్‌ విడుదల


పర్ణశాల: దుమ్మగూడెం గోదావరిపై ఎగువ భాగంలో నిర్మించే సీతమ్మ సా గర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంతో ఎం కాశీనగరం రెవెన్యూ గ్రామపరిధిలో భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో కూడిన గెజిట్‌ను బుధవారం కాశీనగరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచామని పంచాయతీ కార్యదర్శి స్రవంతి తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూములు అవసరం ఉన్నందున సర్వే 2/1 నుంచి 4/బి వరకు 36 మంది రైతుల నుంచి ఏ 15.300 గుంటలు ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం అవసరమై ఉన్నందున భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం సర్వే చేసిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ లెక్కల ప్రకారం పరిహారం అందిస్తామన్నారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలున్నా భూనిర్వాసిత రైతులు గ్రామసభల ద్వారా తెలపాలన్నారు. logo