అభివృద్ధిలో ‘కొత్తగూడెం’ ముందంజ

- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
కొత్తగూడెం : జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ని యోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అ న్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో కొత్తగూడెం పట్టణం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు మంజూ రు అయిన కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..
పట్టణ ప్రజలకు త్వరలో పట్టాలు ఇస్తానని అన్నారు. సర్పంచ్ పదవి నుంచి మంత్రి పద వి వరకు చేశానని అందుకే ప్రజలు నన్ను మళ్లీ గెలిపించారన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల ను మరింత అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కష్టపడతానన్నారు. త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా పూర్తి అవుతాయన్నారు. మున్సిపల్, రెవె న్యూ అధికారులు పట్ణణంలో సరిగా పనిచేయడం లేదని అందువల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. కల్యాణలక్ష్మి పథకం పేదింటి వారికి ఒక వరంలాంటిదని అన్నారు. 74 మంది లబ్ధిదారుల కు రూ.75లక్షల చెక్కులను అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వార్డు కౌన్సిలర్లు బాధ్యతతో పనిచేస్తున్నారని వారికి అధికారులు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా పట్టాలు పంపిణీలో అలసత్వం వహిస్తున్నారంటూ తహసీల్దార్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వహిచడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించనని అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు పట్టాలు ఇ చ్చానని అన్నారు.
మల్లీ నాకు పట్టాలిచ్చే అవకాశం వచ్చిందని సీఎం కేసీఆర్‌తో మాట్లాడి పట్టాలు ఇచ్చే అవకాశం తెచ్చుకున్నానని అన్నారు. వారం రోజుల్లో డేట్ పెట్టి పట్టాలిచ్చే కార్యక్రమం పెట్టాలని తహసీల్దార్‌కు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్స్న్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతురావు, ఎంపీపీలు శాంతి, సోనా, విజయలక్ష్మి, తహసీల్దార్లు నాగరాజు, భద్రకాళి, ఎంపీటీసీలు కొల్లుపద్మ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, కాసుల వెంకట్, దిశ కమిటి సభ్యుడు గిడ్ల పరంజ్యోతిరావు, జక్కుల సుందర్, సర్పంచ్ పూనెం నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ లగడపాటి రమేశ్, కొత్త అంజనాపురం సర్పంచ్ హిరాణి పాల్గొన్నారు.