బుధవారం 20 జనవరి 2021
Badradri-kothagudem - Nov 30, 2020 , 01:33:33

‘గ్రేటర్‌' ప్రచారంలో భద్రాద్రి వాసి

‘గ్రేటర్‌' ప్రచారంలో భద్రాద్రి వాసి

భద్రాచలం: భద్రాచలానికి చెందిన  తూతిక ప్రకాశ్‌ ‘గ్రేటర్‌' ఎన్నికల ప్రచారం చేశారు. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు సైకిల్‌పై వెళ్లి గత వారం రోజులు గా పలు డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌ తరపున సైకిల్‌పైనే ప్రచారం నిర్వహించారు. గతంలో రాష్ట్రం లో పలు చోట్ల జరిగిన సాధారణ, ఉప ఎ న్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఫ్లెక్సీలు సైకిల్‌ కు కట్టి మైక్‌తో ప్రకాశ్‌ ప్రచారం నిర్వహించారు. వృతిరీత్యా ఆర్‌ఎంపీ వైద్యుడైనప్పటికీ టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాల ప్రచారానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంటాడు. ఈసందర్భంగా ‘నమస్తే’తో  ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌పై అభిమానంతోనే ఎక్కడ ఎన్నికలు జరిగినా సైకిల్‌పైనే ప్రచారం చేస్తున్నానని తెలిపారు. కేసీఆర్‌ పాల్గొనే ప్రతి  బహిరంగ సభకు సైకిల్‌పైనే వెళ్లి పాల్గొంటానని పేర్కొన్నారు.


logo