శుక్రవారం 15 జనవరి 2021
Badradri-kothagudem - Nov 30, 2020 , 01:33:30

రెండు దశాబ్దాల తర్వాత అలికిడి

రెండు దశాబ్దాల తర్వాత అలికిడి

  • ఏజెన్సీలోకి పెద్దపులి
  • వారం రోజులుగా పలు మండలాల్లో సంచారం
  • ఉలిక్కిపడుతున్న గ్రామస్తులు
  • అటవీ ప్రాంతంలో నిఘా పెంచిన ఫారెస్ట్‌ అధికారులు

ఇల్లెందు రూరల్‌: సుమారు రెండు దశాబ్దాల తరువాత జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయి. వారం క్రితం వరకు మహబూబాబాద్‌ జిల్లాలో సంచరించిన పెద్ద పులి క్రమంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి అడుగుపెట్టింది. ఇల్లెందు, కరకగూడెం, ఆళ్ళపల్లి, మా మకన్ను అటవీ ప్రాంతాల్లో పులి పాద ముద్రలు కనిపించ డంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సారపాక అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం, వాగులో నీళ్లు తాగడం వంటి దృశ్యాలు ప్రత్యక్షమవడంతో.. ‘నిజంగానే పులి తిరుగుతున్ని’ అని అధికారులు నిర్ధారణకు వచ్చారు.

పాండవుల గుట్ట అడ్డాగా.. 

ఇల్లెందు, బయ్యారం మండలాల సరిహద్దు ప్రాంతం రెండు దశాబ్దాల క్రితం దట్టమైన అడవులతో అల్లుకుని ఉం డేది. ఇదినేడు పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. నాడు మాత్రం పులులకు అడ్డాగా ఉండేది. పులుల నివాసా నికి అనుగుణంగా కనిపించే గుహలు పాండవుల గుట్ట ఏడు బావుల ప్రదేశాల్లో నేటికీ కనిపిస్తున్నాయి. నేటికీ ఆ రా ళ్ల స ముదాయాన్ని పులి గహలుగా పిలుస్తుంటారు. 2000 సం వత్సరంలో బయ్యారం మండలం మిర్యాలపెం ట గ్రా మా నికి చెందిన రెండు ఆవులను పెద్దపులి సంహరించింది. ఆ రోజుల్లో గ్రామం సమీపం వరకు దట్టమైన అడవి ఉండటం తో పులి సంచారాన్ని నాడు ఏజెన్సీ గిరిజనులు పెద్దగా పట్టించుకోలేదు. నాటి సంఘటన తరువాత ఇల్లెం దు ఏజెన్సీలో పులుల సంచారం క్రమంగా అంతరించింది. సు మారు రెండు దశాబ్దాలపాటు పులి ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ప్రస్తుతం అడవుల పునరద్ధరణ పనులు వేగవంతంగా సాగుతుండటంతో పులుల సంచారం మళ్లీ మొదలైంది.

జిల్లాలో వారం రోజులుగా.. 

ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ నేషనల్‌ పార్క్‌ నుంచి రెండు పులులు మహబూబాబాద్‌ జిల్లాకు చేరుకున్నట్లు ఆ జిల్లా అటవీశాఖ అధికారులు ఇటీవల నిర్ధారించారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో 25 రోజుల క్రితం ఆవును పెద్ద పులి చంపిన ఘటన వెలుగు చూసింది. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి సంచారంపై నిఘా పెంచారు. 15 రోజుల క్రితం బయ్యారం, గార్ల మండలాల్లో పులి పాద ముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. వీటి ఆధారంగా ఆధారంగా పులి సంచరించినట్లు నిర్ధారించారు. రెండు పులులు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు రాత్రి వేళలో బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు. మానుకోట జిల్లా నుంచి భద్రాద్రి జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించి బయ్యారం-ఇల్లెందు మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలోని పాండవులగుట్ట, గుండాల మండలం బాటన్న నగర్‌ మీదుగా ఆళ్లపల్లి మండలంలోకి ప్రవేశించినట్లుగా పాద ముద్రల ఆధారంగా అటవీ అధికారులు నిర్ధారించారు. ఆళ్ళపల్లి మండలం మర్కోడు నుంచి భద్రాచలం ఏజెన్సీ సారపాక అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లుగా వీడియో దృశ్యాలు ధ్రువీకరిస్తున్నాయి. ఇటీవలి వరకు పాద ముద్రలే కనిపించాయి. ఇప్పుడు మాత్రం సారపాక అటవీ ప్రాంతంలో పులి ప్రత్యక్షంగా కనిపించింది.

ఏజెన్సీ పల్లెల్లో అలజడి

మహబూబాబాద్‌-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో సుమారు 20 రోజులుగా రెండు పెద్ద పులులు సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఏజెన్సీ ప్రజలను భయపెడుతున్నాయి. పులులు సహజంగా రోజుకు 25 కిలోమీటర్ల దూరం వరకు సంచరిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇల్లెందు ఏజెన్సీ ఎటు చూసినా 50 కిలోమీటర్లు మించి ఉండదు. దీంతో ఏ రోజు ఏ గ్రామంలో పులిని చూడాల్సి వ స్తుందోనని ప్రజలు రాత్రి వేళలో ఇళ్లకే పరిమితమవుతున్నా రు. పగటి పూట కూడా అటవీ ప్రాంతాలకు దూరంగా ప్ర యాణం సాగిస్తున్నారు.

ప్రజలను అప్రమత్తం చేశాం

ఇల్లెందు ఏజెన్సీలో పులి సంచారాన్ని గుర్తించాం. వారం రోజుల క్రితం పాండవులగుట్ట, బాటన్న నగర్‌ అటవీప్రాంతంలో పులి సంచరించినట్లుగా పాదముద్రల ద్వారా అనుమానించాం. పులి సంచారాన్ని గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం. తాజాగా సారపాక అటవీ ప్రాంతంలో పులి సంచారంపై వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఇదే విషయమై శాఖాపరంగా అప్రమత్తంగా ఉంటూనే ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తున్నాం. అటవీప్రాంతంలోకి వెళ్లకూడదని చెబుతున్నాం. పులి ఆనవాళ్ల కనిపిస్తే మాకు వెంటనే చెప్పాలని ప్రజలను కోరుతున్నాం.

- రవికిరణ్‌, ఎఫ్‌ఆర్‌వో, ఇల్లెందు మండలం