ఆదివారం 24 జనవరి 2021
Badradri-kothagudem - Nov 29, 2020 , 01:09:57

భద్రాద్రి రామయ్యకు సువర్ణ తులసార్చన

భద్రాద్రి రామయ్యకు సువర్ణ తులసార్చన

   భద్రాచల శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం   అర్చకులు అంతరాలయంలో ఆర్జిత సేవలో భాగంగా రామయ్యకు సువర్ణ తులసార్చన నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణాన్ని కనుల పండువగా చేపట్టారు. తెల్లవారుజామున అర్చకులు  గోదావరి నుంచి తీర్థెబిందె తీసుకొని వచ్చి అభిషేకం నిర్వహించారు.  ఆరాధన, సేవా కాలం, పుణఃవచనం, నివేదన తదితర పూజలను గావించారు. అనంతరం బేడా మండపంలో స్వామివారిని కొలువుదీర్చారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాలు, వేద ఆశ్వీరచనాన్ని శాస్ర్తోక్తంగా చేపట్టారు.  

- భద్రాచలం


logo