ఆదివారం 24 జనవరి 2021
Badradri-kothagudem - Nov 28, 2020 , 01:03:20

జగన్మోహిని అలంకారంలో శ్రీసీతారామచంద్రస్వామి

జగన్మోహిని అలంకారంలో  శ్రీసీతారామచంద్రస్వామి

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం అర్చకులు క్షీరాబ్ది ద్వాదశి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి వారు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు నిత్య కల్యాణ మండపంలో స్వామి వారికి  అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్థాన విద్వాంసులు కీర్తనలు ఆలపిస్తుండగా స్వామివారికి హారతి ఇచ్చారు. చివరగా క్షీరామృత నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ వైదిక, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. 

     - భద్రాచలం 


logo