ఆదివారం 24 జనవరి 2021
Badradri-kothagudem - Nov 28, 2020 , 01:03:20

భద్రాద్రి రామయ్యకు నిత్య కల్యాణం..

భద్రాద్రి రామయ్యకు నిత్య కల్యాణం..

భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామ చంద్రస్వామి వారి శుక్రవారం భక్తులకు స్వర ్ణభద్ర కవచాలతో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత అర్చకులు రామయ్యకు నిత్యకల్యాణం కనుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు  గోదావరి నుంచి తీర్దెబిందెను తీసుకొని వచ్చి అభిషేకం నిర్వహించారు.  ఆరాధన, సేవా కాలం, పుణఃవచనం, నివేదన తదితర పూజలను గావించారు. అనంతరం బేడా మండపంలో స్వామివారిని కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ణోపవీతధారణ, కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాలు, వేద ఆశీర్వచనాన్ని ఆలయ అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

రాముని సన్నిధిలో శరత్‌బాబు

ప్రముఖ తెలుగు సినీ నటుడు శరత్‌బాబు శుక్రవారం కుటుంబ సమేతంగా రామయ్యను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీతాయారు ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాలను సందర్శించారు. అర్చకులు ఆలయ విశిష్టతను ఆయనకు వివరించారు.  logo