స్వయం ఉపాధికి ఊతం

- మహిళలకు ప్రభుత్వ భరోసా
- ‘న్యాక్' ద్వారా టైలరింగ్‌లో శిక్షణ
- వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు సువర్ణావకాశం
- ఉచితంగా కుట్టు మిషన్ అందజేత
కొత్తగూడెం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోంది. వారికి కావాల్సిన అవకాశాలను కల్పించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు చేయూతనిస్తోంది. ఇప్పటికే మెప్మా, సెర్ప్ ఆధ్వర్యంలో మహిళలకు రుణాలను మంజూరు చేసి వారిని ఆర్థికంగా రాణించేందుకు కృషి చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని మహిళలకు వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణనిస్తూ వారు ఎంచుకున్న విభిన్న రంగాల్లో మెళకువలను నేర్పిస్తూ ఉపాధి చూపుతోంది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్), ముస్లిం మైనారిటీ కమిషన్ ఆధ్వర్యంలో శిక్షకులు ముస్లిం మహిళలకు కుట్టుమిషన్ టైలరింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు.
ఉచితంగా కుట్టుమిషన్ అందజేత..
టైలరింగ్‌లో ఆసక్తి ఉన్న ముస్లిం మైనారిటీ మహిళలకు న్యాక్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మైనారిటీ కమిషన్ సహాయ, సహకారాలతో ఈ శిక్షణ ఇస్తున్నది. మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి వారికి కుట్టుమిషన్‌లో ఉన్న వివిధ రకాల డిజైన్లను నేర్పుతున్నది. అనుభవం కలిగిన ఇన్‌స్ట్రక్టర్ల పర్యవేక్షణలో ఉదయం వేళ తరగతిలో (థియరీ) క్లాసులు, మధ్యాహ్నం ప్రాక్టికల్స్ నేర్పుతున్నారు. సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ బ్యాచ్ డిసెంబర్ 3వ తేదీతో ముగుస్తుంది. సుమారు 25 మంది వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మహిళలు న్యాక్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. ఉచితంగా భోజనం, మెటీరియల్, యూనిఫాంతో పాటు రికార్డు నిర్వహణ, భవిష్యత్తు ఫ్యాషన్ రంగాలకు అనుగుణంగా ఇక్కడ టైలరింగ్‌లో అవసరమైన మెళకువలను నేర్పుతున్నారు.
అన్నివర్గాల మహిళలకు శిక్షణ..
న్యాక్, ముస్లిం మైనారిటీ, కార్మికశాఖ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా మహిళలందకీ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) ప్రధాన భాగస్వామ్యంతో రైటర్‌బస్తీలోని కోర్టు ఎదురుగా గల శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్మికశాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల్లోని కుటుంబాల్లోని మహిళలకు, యువతులకు మూడు నెలల పాటు టైలరింగ్‌లో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఏడాదిలో రెండుస్లారు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. అదే విధంగా నిర్మాణ రంగంలో ఉన్న మహిళా కూలీలు, వారి పిల్లలకు భవన నిర్మాణ రంగంలో మెళకువలను నేర్పిస్తున్నారు. వీటితోపాటు వారికి ఉపకార వేతనాలు కూడా ఇస్తూ ఉపాధి కూడా కల్పిస్తుండటం విశేషం.
తాజావార్తలు
- చెన్నైలోనే ఐపీఎల్ -2021 వేలం!
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్
- ఇక మొబైల్లోనే ఓటరు గుర్తింపు కార్డు
- ఎయిర్‌పోర్ట్‌లో రానా, మిహీక
- చిరుతను చంపి.. వండుకుని తిన్న ఐదుగురు అరెస్ట్
- పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ 9 మంది ప్రయాణికులు
- వాళ్లను చూస్తే కాజల్‌కు మంటపుడుతుందట..
- జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల
- పది మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ చార్జిషీట్