బుధవారం 20 జనవరి 2021
Badradri-kothagudem - Nov 27, 2020 , 02:32:52

తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి

తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి

అశ్వాపురం: తుఫాను ప్రభావం ఉన్నందున అప్రమత్తంగా ఉండి రైతులు రెండు రోజుల పాటు వరి కోతలు నిలిపివేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సూచించారు. గురువారం ఆయన అశ్వాపురం  మండలం నెల్లిపాకలో పర్యటించి గ్రామస్తులు, రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం నింపేందుకు ఖాళీ సంచులు సరిపోను ఉండేట్లు చూడాలన్నారు. మొండికుంటలో నిర్మించిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డులను పరిశీలించి సర్పంచ్‌ మర్రి మల్లారెడ్డి, పాలకవర్గ సభ్యుల పనితీరును అభినందించారు. నెల్లిపాక బంజరలోని శ్రీరామా జిన్నింగ్‌ మిల్‌లో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు.

కౌలు రైతులు పండించిన పత్తి కొనుగోలు చేయటం లేదని, భూమి యజమాని వస్తేనే కొనుగోలు చేసి వారి ఖాతాలో డబ్బు జమచేస్తున్నారని కౌలు రైతులు ఆయన దృష్టికి సమస్యను తీసుకురాగా ప్రస్తుతానికి ఆ అవకాశం లేదని త్వరలో వస్తుందని కౌలు రైతులకు సమాధానమిచ్చారు. కార్యక్రమంలో డీపీవో రమాకాంత్‌, డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌రాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అభిమన్యుడు, డీసీఓ మైఖేల్‌ బోస్‌, జడ్పీ సీఈఓ విద్యాలత, తహసీల్దార్‌ పీవీ రామకృష్ణ, ఏవో డి.సాయిశంతన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo